ప‌వ‌న్ మామ ముందు బ‌న్ని సిగ్గేల‌

Last Updated on by

అల్లు అర్జున్ కూడా సిగ్గు ప‌డ‌తాడా? ముసిముసిగా న‌వ్వుతూ పేరు కూడా పూర్తిగా ప‌ల‌క‌కుండా తెగ సిగ్గు ప‌డిపోయాడే!! అరే మామా మ‌జాకానా? ఆ మామ ఎంత ప‌వర్‌ఫుల్‌నో ఈరోజు నా పేరు సూర్య థాంక్యూ ఇండియా మీట్‌లో తెలిసొచ్చింది. లైవ్ సాక్షిగానే బ‌న్ని చాలానే సిగ్గు ప‌డిపోయాడు. మామ ప‌క్క‌నే ఉండ‌గా పేరైనా ప‌ల‌క‌లేక‌పోయాడు! అయితే ఆ మామ‌లోని ప‌వ‌ర్‌, ఒగ‌రు, కోపం ముందు అవ‌త‌లివాడు ఎవ‌డైనా ఆగి చూడాల్సిందేన‌న్న‌ది దీన‌ర్థం. అందుకే ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్‌గా, జ‌న‌సేనానిగా అంచెలంచెలుగా ఎదిగేస్తున్నాడు ప‌వ‌న్‌.

అల్లు అర్జున్ `నా పేరు సూర్య‌` థాంక్యూ ఇండియా మీట్ వేడుక‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌న్నిని ఉద్ధేశించి మంచి సూచ‌న‌లే చేశారు. “నా పేరు సూర్య సినిమా మీతో పాటు చూడాల‌ని నాకు కోరిక క‌లిగింది. మిగ‌తా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లే ముందే ఈ సినిమా చూడాల‌ని నిర్ణ‌యించుకున్నా. వ‌క్క ంతం ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడుగా ముందే తెలుసు. నాకు కూడా కొమ‌రం పులి టైమ్‌లో క‌థ చెప్పారాయ‌న‌. కానీ ముందుకెళ్ల‌లేక‌పోయాం. ఆ త‌ర‌వాత అల్లు అర్జున్‌తో ఈ సినిమా తీయ‌డం ఆనందాన్నిచ్చింది. ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్‌ వ్య‌క్తిగ‌తంగా తెలుసు. ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాకాంక్ష‌లు. నిర్మాత‌ వాసుకు శుభాకాంక్ష‌లు. అన్న‌య్య నాగ‌బాబు నిర్మాత అని తెలియ‌దు. ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు. బ‌న్ని త‌న తొలి సినిమా త‌ర‌వాత వ‌చ్చిన `ఆర్య` నాకు చాలా న‌చ్చిన సినిమా. త‌ర‌వాత త‌న కెరీర్ ఎదిగిన తీరు ఆనందం క‌లిగించింది. మునుముందు అల్లు అర్జున్ న‌టించిన సినిమాలు విజ‌యాలు సాధించాలి. తన తాత‌గారికి, త‌ల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. నా పేరు సూర్య టీమ్‌కి థాంక్స్‌. ఓ మంచి సినిమాని ల‌గ‌డ‌పాటి, వ‌క్క ంతం, అల్లు అర‌వింద్ నుంచి రావ‌డం సంతోషంగా ఉంది“ అన్నారు. “ఈ చిత్రంలో నా న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ స‌మావేశం పేరే థాంక్యూ ఇండియా. తొలిగా థాంక్యూ చెప్పాల్సింది మా అతిధి ప‌వ‌ర్‌స్టార్‌…కి“ అంటూ బ‌న్ని చాలానే సిగ్గు ప‌డ్డాడు. మొత్తానికి ఈవెంట్‌లో ఆ రెండు ఘ‌ట‌న‌లు ఆడియెన్‌లో ఆస‌క్తి రేకెత్తించాయి. ఫ‌న్నీగానూ అనిపించాయి. మామా – అల్లుళ్ల మ‌ధ్య అంత ఉంటుంద‌న్నమాట‌!

User Comments