`రోబో2` నిర్మాత‌ల‌తో అల్లు శిరీష్‌

Last Updated on by

`సింగం` సూర్య – సెల్వ రాఘవన్ కాంబినేష‌న్‌లో `ఎన్‌జీకే` చిత్రీక‌ర‌ణ ముగింపులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆన్‌సెట్స్ ఉండ‌గానే `బ్ర‌ద‌ర్స్‌` ఫేం కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో 37వ సినిమాలో న‌టించేందుకు సూర్య ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టున‌కు సంబంధించిన‌ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. ఇందులో భాగంగా న‌టీన‌టుల్ని ఎంపిక చేస్తున్నారు. సూర్య‌తో పాటు ఈ క్రేజీ సినిమాలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ‌హీరో అల్లు శిరీష్‌కి ఓ అద్భుత‌మైన పాత్ర‌ను ఆఫ‌ర్ చేశార‌ట కె.వి.ఆనంద్‌. మ‌రో రెండు నెల‌ల్లో ఎన్జీకే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని సూర్య తాజా ప్రాజెక్టు కోసం అందుబాటులోకి రానున్నాడు. ఆ మేరకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ సూర్య న‌టించే 37వ సినిమా వివ‌రాల్ని అధికారికంగా వెల్ల‌డించింది.

సూర్య‌కు ఘ‌టికుడు లాంటి హిట్ సినిమాని ఇచ్చిన కేవీ ఆనంద్ `బ్ర‌ద‌ర్స్‌` లాంటి ఫ్లాప్ సినిమాని ఇచ్చాడు. ఈసారి హ్యాట్రిక్ మూవీ ఏం చేస్తాడో చూడాలి. ఇది వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న సూర్య‌కు, అటు ఫ్లాపుల్లోనే ఉన్న‌ కేవీ కెరీర్‌కి ఎంతో ఇంపార్టెంట్‌. ఇక ఈ చిత్రంతో అల్లు శిరీష్ త‌మిళంలోనూ నిరూపించుకోవాల్సి ఉంటుంది. సూర్య న‌టిస్తున్న ఎన్జీకే చిత్రం దీపావళికి రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

User Comments