అమ‌లాపాల్ మాజీకి హిట్ కావాలి

Last Updated on by

అమ‌లాపాల్ మాజీ మొగుడు ఏఎల్ విజ‌య్. ఈయ‌న త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో దూసుకెళ్తోన్న ద‌ర్శ‌కుడు. ఏడాదికి కావాలంటే రెండు మూడు సినిమాలు కూడా చేస్తాడు. కానీ విజ‌యాలు మాత్రం ఇవ్వ‌డు. అలాగ‌ని చెత్త సినిమాలు చేస్తాడా అంటే అదీ లేదు. మంచి సినిమాలు చేస్తాడు కానీ అవి ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌వు. అవార్డుల‌కు మాత్ర‌మే మిగిలిపోతాయి. గ‌తేడాది అభినేత్రితో డిజాస్ట‌ర్ ఇచ్చిన విజ‌య్.. వ‌న‌మ‌గ‌న్ తో జస్ట్ ఓకే అనిపించాడు. ఇప్పుడు క‌ణంతో వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు.

సాయిప‌ల్ల‌వి, నాగ‌శౌర్య జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి మంచి సినిమా అనే ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి కానీ ఎప్ప‌ట్లాగే క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌ట్లేదు. బ్రూణ హ‌త్య‌లు కాన్సెప్ట్ తీసుకుని మ‌న‌సు హ‌త్తుకునే విధంగా తెర‌కెక్కించాడు విజ‌య్. సాయిప‌ల్ల‌వి కూడా ప్రాణం పోసింది త‌న పాత్ర‌కు. నాగ‌శౌర్య కూడా బాగా చేసాడు. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం ఈ చిత్రం వ‌ర్క‌వుట్ అవ్వలేదు. అప్ప‌ట్లో విక్ర‌మ్ తో నాన్న సినిమా చేసాడు విజ‌య్. అది కూడా క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ అవార్డులు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు ఈయ‌న చేసిన ప్ర‌య‌త్నానికి క‌ణంకు కూడా అవార్డులు ఖాయం కానీ క‌లెక్ష‌న్లు మాత్రం నిరాశే. మ‌రి.. ఈయ‌న నుంచి హిట్ట‌య్యే సినిమా ఎప్పటికి వ‌స్తుందో..?

User Comments