బిలియ‌న్ డాల‌ర్ గేమ్ ఛేంజ‌ర్‌?

Last Updated on by

ఇండియ‌న్ సినిమాకి చైనాలో మ‌హ‌ర్ధ‌శ ప‌ట్ట‌నుందా?  ఇండియా మార్కెట్‌కి అక్క‌డ‌ అసాధార‌ణ‌ గిరాకీ పెర‌గ‌నుందా? అంటే అవుననే తాజా స‌న్నివేశం చెబుతోంది. అయితే అందుకు అమీర్ అంకుల్ వార‌ధిలా నిలుస్తుండ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో వాడివేడిగా చ‌ర్చ‌కొచ్చింది. ఇటు సినిమా, అటు ఇత‌ర‌త్రా భార‌తీయ వ‌ర్త‌కం చైనాలో అభివృద్ధి చెందేందుకు మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఆలంబ‌న‌గా మార‌నున్నాడు. అంతేకాదు చైనాలో భార‌త‌దేశ వ‌ర్త‌క‌, వాణిజ్యానికి అత‌డు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతాడ‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు మ‌న ప్ర‌భుత్వం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ లేదు కానీ, అమీర్ ప్ర‌భావం ఆ స్థాయిలోనే క‌నిపిస్తోంద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.
దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ చిత్రాల‌తో చైనాలో అసాధార‌ణ విజ‌యాలు అందుకున్న అమీర్ ఖాన్ (55) ప్ర‌స్తుతం అక్క‌డ ఎంతో ఫేమ‌స్ స్టార్‌. చైనీ అభిమానులు అమీర్ అంకుల్ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. అంటే ఆ మేర‌కు మ‌న అమీర్‌కి చైనాలో గుర్తింపు ద‌క్కిన‌ట్టే. అంతెందుకు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి హువా చున్ ఇంగ్  `దంగ‌ల్` చూసి ఫిదా అయిపోయారంటే అర్థం చేసుకోవాలి. ప్ర‌స్తుతం అత‌డు అమీర్‌కి వీరాభిమాని. కాబ‌ట్టి ఇక చైనా వ‌ర్త‌కానికి అమీర్ సాయం చాలానే ఉంద‌ని భార‌త ప్ర‌భుత్వం భావిస్తోందిట‌. ఇక సినిమాల ప‌రంగా చూస్తే ఇండియాలో 500 కోట్లు- చైనాలో 1000 కోట్లు సంపాదించ‌డం ఎలానో ఇండియా ఫిలింమేక‌ర్స్‌కి నేర్పిస్తున్న అమీర్‌ఖాన్ ఇప్పుడు డ్యూయ‌ల్ గేమ్ ప్లానింగ్ మ‌రింత రాటుదేల‌నున్నాడు. ఇలాంటి గ్రేట్ ట‌ఫ్ టాస్క్ మాష్ట‌ర్ .. ఇప్పుడు ఏకంగా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైతే పెద్ద స్థాయిలోనే పావులు క‌దుపుతున్నాడంలో సందేహం లేదు. ఓవైపు రిల‌య‌న్స్ అంబానీలు ఇటు అమీర్‌తో, అటు చైనా సినిమా కంపెనీల‌తో ఇటీవ‌లే బిగ్ డీల్ కుదుర్చుకున్నారు. అమీర్‌-రిల‌య‌న్స్‌ `మ‌హాభార‌తం`ని చైనాలో రిలీజ్ చేసి భారీగా ఆర్జించ‌డ‌మే ధ్యేయంగానే పెద్ద స్కెచ్ వేశారు. ఈ టైమ్‌లో అంత‌కంత‌కు అమీర్ ఖాన్ కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకెళతాడ‌నే భావించాలి. మ‌రోవైపు అమీర్ నటించిన `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` చిత్రాన్ని చైనాలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ఖాన్ అంకుల్ ట్రై చేస్తాడ‌న‌డంలో సందేహం లేదు. ఈ ఎటెంప్ట్ ఓ ర‌కంగా ఇండియ‌న్ సినిమాకి మ‌హ‌ర్ధ‌శ అనే చెప్పాలి. అమీర్ వెంటే ఇత‌ర ఫిలింమేక‌ర్స్ క్యూ క‌ట్టి చైనా మార్కెట్‌ని కొల్ల‌గొట్టి, యువాన్‌లు ఏరుకుంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు!

User Comments