ఏపీలో అమెరిక‌న్ పోలీస్ స్టైల్‌!?

కొత్త సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తూనే గౌత‌మ్ స‌వాంగ్ ని కొత్త డీజీపీగా ప్ర‌క‌టించారు. ఏపీ లో నేరాలు- స‌వాళ్ల‌ను ఆయ‌న స్వీక‌రిస్తార‌ని వెల్ల‌డించారు. అందుకు త‌గ్గ‌ట్టే స‌వాంగ్ యాక్ష‌న్ మోడ్ లోకి వ‌చ్చేశారు. యువ సీఎంతో పోటీప‌డుతూ తుక్కు రేగ్గొట్టే ప్లాన్ లో ఉన్నారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పిన తాజా సంగ‌తులు ఆస‌క్తిక‌రం. స‌వాంగ్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ గురించి అవగాహన కోసం, పోలీసులు వాడే టెక్నాలజీ గురించి ప్రజలు తెలుసుకోవడం కోసం ఎగ్జిబిషన్ లో అవుట్ పోస్ట్ పెట్టాం. వేలాది మంది ప్రజలు వచ్చే ప్రాంతం కాబట్టి ఎగ్జిబిషన్ లో స్టాల్స్ రెడీగా ఉన్నాయి. ఇక్క‌డ‌ పోలీస్ సర్వీస్ ను ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. అలాగే పోలీస్ సర్వీస్ లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ లపై కమిటి వేగంగా పనిచేస్తుంది.. రెండు మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. అతి త్వరలో పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ లపై విధివిధానాలు రూపొందబోతున్నాం అని తెలిపారు.

పోలీస్ శాఖ సంస్క‌ర‌ణ‌ల‌పై మాట్లాడుతూ.. ఈ రంగంలో బదిలీలు అనేవి నిరంతప్రక్రియ. యూనిట్ ఆఫీసర్స్ వరకు బదిలీలు అయ్యాయి.. తొందరపడి బదిలీలు చేయడంలేదని తెలిపారు. పొలిటికల్ దాడుల పై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారిచేశామ‌ని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సీపీ ద్వారకా తిరుమల రావు, క్రైమ్ డీసీపీ రాజకుమారి, డీసీపీ హర్షవర్ధన్ రాజ, ఏసీపీ రమేష్ బాబు, భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మేనేనింగ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.