తానా వాళ్ల‌కు తానా తందానా

Last Updated on by

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. ఇది ఏ రేంజులో ఉందంటే ఏకంగా అక్క‌డ తెలుగు సంఘాల అధినేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించే రేంజులో ఉంది. ది గ్రేట్ `తానా` అధ్య‌క్షుడి మెడ‌కే ఇది గుదిబండ‌లా త‌గులుకుంద‌ని తెలుస్తోంది. ఈవెంట్ల పేరుతో యాంక‌ర్లు, క‌థానాయిక‌ల్ని అమెరికా పిలిచిన పాపానికి ఇప్పుడు ఏకంగా తానా అధ్య‌క్షుడు స‌తీష్ వేమ‌న‌ను ఫెడ‌ర‌ల్ పోలీసులు విచార‌ణ పేరుతో పిలిచారుట‌.

అయితే అచ్చులో బొమ్మ తిర‌గ‌బ‌డిన‌ట్టు.. ఆయ‌న ఫోన్‌కు పోలీసులు ఎంత ట్రై చేసిన క‌ల‌వ‌డం లేదుట‌. దాంతో తానా సెక్ర‌ట‌రీకి ఓ మెసేజ్ పంపించి .. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా ఫెడ‌ర‌ల్ పోలీస్ కోరార‌ట‌. మొత్తానికి ఎవ‌రికి ఏ రేంజులో పోయించాలో ఆ రేంజులో పోయిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా తానా వాళ్ల‌కు తానా తందానా త‌ప్ప‌డం లేదు. చికాగో పోలీసులు 42 పేజీల ఫిర్యాదును న‌మోదు చేసుకుని తాట తీస్తున్నారు. అమెరికా పర్యటన కోసం ఉపయోగించిన పలు తెలుగు సంఘాల లేఖల్ని పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నార‌ట‌. ఈ దెబ్బ‌కు కిష‌న్‌-చంద్ర‌క‌ళ దంప‌తుల నిర్వాకానికి అంద‌రూ ద‌ణ్ణం పెట్టేస్తున్నార‌ట‌.

User Comments