పాకిస్తాన్‌తో హీరోగారి గూడుపుటానీ

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా శ‌త్రుదేశం పాకిస్తాన్ కొత్త అధ్య‌క్షుడి ప్ర‌మాణ స్వీకారం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ వేడుక‌కు ఇండియా నుంచి మోదీ వెళ్లే ఛాన్సుంది. అధ్య‌క్షుడు అవుతోంది సాక్షాత్తూ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ కాబ‌ట్టి ఇక క్రికెట‌ర్లు క‌పిల్‌దేవ్‌, గ‌వాస్క‌ర్ వంటి వాళ్లు ఈ ప్ర‌మాణ స్వీకార ఉత్స‌వానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఇదే వేడుక‌కు వేరొక‌రు అటెండ్ కానున్నారు. అత‌డే మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్‌. అత‌డు ఈ ప్ర‌మాణ స్వీకారానికి ఎటెండ్ కావ‌డం వెన‌క పెద్ద బిజినెస్ స్ట్రాట‌జీనే వ‌ర్క‌వుట్ కానుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాల‌కు పాకిస్తాన్‌లో ఎన్నో అడ్డంకులు. దానిని అమీర్ చెరిపేస్తాడ‌నే అంతా భావిస్తున్నారు. ఇండియా, చైనా మార్కెట్లు స‌హా పాక్‌లో త‌న సినిమాలు రిలీజైతే బంప‌ర్‌హిట్లే. అక్క‌డా మ‌రో 500 కోట్లు దండుకోవ‌చ్చ‌నేది అమీర్ ప్లాన్ అని చెబుతున్నారు. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్, మ‌హాభార‌తం 3డి (భారీ సిరీస్‌) వంటి భారీ చిత్రాల్ని అమీర్‌ఖాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments