మెగాస్టార్‌, కింగ్‌పై బిగ్ పంచ్‌

Last Updated on by

అవును.. ఇది ప‌క్కా నిజం .. మెగాస్టార్‌పైనా, కింగ్ నాగార్జున‌పైనా బిగ్ పంచ్ ప‌డింది. ఇంత‌కీ అంత త‌ప్పేం చేశారు.. అంటారా? అయితే డీప్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.

అయితే ఈ పంచ్‌కి కార‌ణ‌మేంటో తెలుసుకోవాలి. వాణిజ్య ప్ర‌పంచంలో ఏదైనా ఉత్ప‌త్తి వేగంగా సేల్ అవ్వాలంటే స్టార్ గ్లామ‌ర్‌తో ప్ర‌క‌ట‌న‌లు రూపొందించాల్సి ఉంటుంది. ఇలాంటి విష‌యంలో క‌ళ్యాణ్ జువెల‌ర్స్ ఎంతో స్పీడ్ చూపిస్తుంటుంది. గ‌త కొన్నేళ్లుగా స‌ద‌రు జువెల‌రీ కంపెనీ అన్ని భాష‌ల్లోని స్టార్ల‌తో ప్ర‌క‌ట‌న‌లు రూపొందించి, ప్ర‌చారం చేయించుకుంటోంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌, ఆయ‌న కుమార్తె శ్వేత బచ్చన్ నందాలతో ఓ ప్ర‌క‌ట‌న రూపొందించింది. అయితే ఈ ప్ర‌క‌ట‌న ఊహించ‌ని రీతిలో అబాసుపాలైంది. క‌ళ్యాణ్ జువెల‌ర్స్ యాడ్ త‌మ మ‌నోభావాల్ని దెబ్బ తీసిందంటూ బ్యాంక‌ర్ల అసోసియేష‌న్ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసింది. ప్ర‌క‌ట‌న‌ను వెంట‌నే తొల‌గించ‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. దీంతో కళ్యాణ్ జువెల‌ర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణ్ రామన్ స్పందించి జ‌రిగిన త‌ప్పున‌కు సారీ చెప్పారు. త‌ప్పును స‌రి చేసుకుంటూ.. వెంట‌నే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ప్ర‌క‌టించారు. ఇక ఇదే ప్ర‌క‌ట‌న తెలుగు వెర్ష‌న్‌లో కింగ్ నాగార్జున న‌టించారు. ప్ర‌క‌ట‌న‌ను తొల‌గించి, ఇప్పుడు మ‌రో కొత్త ప్ర‌క‌ట‌న రూపొందించ‌నున్నార‌న్న‌మాట‌! అలా ప‌డింది పంచ్!

User Comments