దీపికా కత్రిన మధ్యలో మెగాస్టార్

Last Updated on by

అమితాబ్ బ‌చ్చ‌న్.. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుడు. 40 ఏళ్లుగా బాలీవుడ్ ను మకుటం లేని మ‌హారాజులా ఏలుతున్నాడు బిగ్ బి. ఇంత సాధించినా ఈయ‌న‌లో ఇంకా చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం మాత్రం పోలేదు. ఇప్ప‌టికీ జోక్స్ వేసి అంద‌ర్నీ నవ్విస్తుంటారు బిగ్ బి. ఇప్పుడు కూడా ఇలాంటిదే చేసి దేశం మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్నారు అమితాబ్ బ‌చ్చ‌న్. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ మ‌ధ్యే దీపిక‌, క‌త్రినా కంటే హీరోలు పొట్టిగా ఉన్నారంటూ ఓ వార్త ప్ర‌చురించారు ఓ ప్ర‌ముఖ పేప‌ర్. ప‌ద్మావ‌త్ లో దీపిక కంటే షాహిద్ పొట్టిగా ఉన్నాడ‌ని.. ఇక థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో క‌త్రినా కంటే అమీర్ చాలా పొట్టిగా ఉన్నాడంటూ వార్త ప్ర‌చురించింది ఇంగ్లీష్ డైలీ. దీన్ని చాలా కామెడీగా త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసాడు అమితాబ్. ఆ కట్ చేసిన పేప‌ర్ చూపిస్తూ ఒక జాబ్ అప్లికేష‌న్ పెట్టాడు అమితాబ్ బ‌చ్చ‌న్. దీపిక, కత్రినా పక్కన అమీర్, షాహిద్ పొట్టిగా ఉంటారు కానీ తాను మాత్రం పొడ‌వుగానే ఉంటాన‌ని కామెడీగా ఓ రెస్యూమ్ పోస్ట్ చేసాడు బిగ్ బి.

జాబ్‌ అప్లికేషన్‌:
పేరు: అమితాబ్‌ బచ్చన్‌
పుట్టినతేదీ: 11-10-1942, అలహాబాద్‌
వయసు: 76 ఏళ్లు
అర్హత: 49 ఏళ్ల పాటు సినిమాలు చేస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు 200 సినిమాలు చేసుంటాను
తెలిసిన భాషలు: హిందీ, ఇంగ్లిష్‌, పంజాబీ, బెంగాలీ
ఎత్తు: 6’2’’. మీకు హైట్‌ సమస్య ఉండనే ఉండదు..అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు అమితాబ్‌. ఈయ‌న చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఎంతైనా అమితాబ్ బ‌చ్చ‌న్ పొడ‌వు మాదిరే ఆయ‌న పంచ్ లు కూడా అంతే పొడ‌వుగా న‌వ్విస్తుంటాయి. ప్ర‌స్తుతం ఈయ‌న థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్ లో అమీర్ ఖాన్ తో క‌లిసి న‌టిస్తున్నారు. ఇక దాంతోపాటు 102 నాటౌట్‌.. బ్రహ్మాస్త్రా.. చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు అమితాబ్ బ‌చ్చ‌న్.

User Comments