దోస్తీ కోసం కోటి వ‌దులుకుని..

Last Updated on by

కోటి రూపాయ‌ల చెక్ అంటే చిన్న మొత్త‌మా? అలాంటి ఆఫ‌ర్ వ‌స్తే ఎవ‌రైనా వ‌దులుకుంటారా? కానీ ఆయ‌న వ‌దులుకున్నారు. అది కూడా కేవ‌లం ఇచ్చిన వ్య‌క్తితో ఉన్న స్నేహం కోసం. స్నేహానికి విలువ‌ను ఆపాదిస్తూ ఆయ‌న చేసిన ఆ ప‌ని ఇప్ప‌టికీ చ‌ర్చ‌ల్లోకి వ‌స్తూనే ఉంది. అస‌లింత‌కీ ఎవ‌రా స్నేహితుడు? అంటే ది గ్రేట్ కింగ్ ఖాన్‌, బిగ్‌బి మ‌ధ్య‌నే!

ఇదివ‌ర‌కూ కింగ్‌ఖాన్‌ షారూక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ నిర్మించిన `ప‌హేళి` (2005) చిత్రంలో అమితాబ్ 10 నిమిషాల నిడివి ఉండే అతిధి పాత్ర‌లో న‌టించారు. ఆ పాత్ర కోసం బిగ్‌బి ఎంత‌గానో శ్ర‌మించారు. అత‌డిపై చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గానే నిర్మాత షారూక్ కోటి రూపాయ‌ల (10 మిలియ‌న్ రూపాయ‌లు) చెక్‌ను బిగ్‌బి అమితాబ్‌కి అందించాడు. అయితే కేవ‌లం త‌మ మ‌ధ్య ఉన్న స్నేహానికి విలువ‌నిచ్చి అది త‌న‌కోస‌మే చేశాన‌ని వారించి ఆ చెక్‌ని తీసుకోలేదు. ఈ విష‌యాన్ని షారూక్ ప‌లు సంద‌ర్భాల్లో ఇంట‌ర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఈరోజుల్లో అలాంటి విలువ‌లు హీరోలు పాటిస్తున్నారా? అంటే .. అదో పెద్ద ప్ర‌శ్న కిందే మిగుల్తుంది

User Comments