రేటింగులు వ‌ద్దు ప్లీజ్‌!

Last Updated on by

“అమ్మ‌మ్మ‌గారి ఇంటికి రేటింగులిస్తారా? అమ్మ‌మ్మ‌కు రేటింగు క‌డ‌తారా? ఈ ఒక్క సినిమాకి వ‌ద్దు ప్లీజ్‌“ ఇదీ హీరో నాగ‌శౌర్య అభ్య‌ర్థ‌న‌! అమ్మ‌మ్మ‌తో అనుబంధం ఓసారి గుర్తు చేసుకోండి అంటూ మీడియాని అభ్య‌ర్థించాడు శౌర్య‌. శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ – రాజేష్ సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం `అమ్మమ్మగారిల్లు`. `కాకినాడ‌` సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ టీజ‌ర్ ను ఆవిష్క‌రించారు. ఈ వేడుక‌లో నాగ‌శౌర్య మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

“అమ్మ‌మ్మ‌గారిల్లు ఒక గుడిలాంటింది. గుడికెళ్లిన‌ప్పుడు శ‌త్రువులు ఎదురైనా ద‌ర్శ‌నం చేసుకుని వ‌స్తాం కానీ గుడిలోనే గొడ‌వ ప‌డం. అలాగే అమ్మ‌మ్మ‌గారి ఇంటికెళ్లిన‌ప్పుడు బంధువుల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నా బ‌య‌ట‌కి న‌వ్వుతూ ఉంటారు. అమ్మ‌మ్మ బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని అలా చేస్తారు. అవ‌న్నీ అమ్మ‌మ్మ‌గారిల్లులో చూస్తాం. అమ్మ‌మ్మ ఇంటితో నా అనుబంధం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. మ‌ళ్లీ ఆ జ్ఞాప‌క‌ల‌న్నీ ఈ సినిమా గుర్తు చేసింది. రేటింగులు ఇవ్వాల్సిన సినిమా కాదు ఇది. ఈ సినిమాకు ఇవ్వొద్దు ప్లీజ్‌. సుంద‌ర్, ర‌సూల్ టాప్ టెక్నీషియ‌న్స్‌. షామిలీ మంచి స‌హ‌న‌టి. 15 ఏళ్ల క్రిత‌మే న‌టిగా నిరూపించుకుని ఈ సినిమాతో మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిర్మాత‌లు రాజేష్‌, కుమార్ చాలా ఫ్యాష‌న్ తో ఈ సినిమా చేశారు.అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు. ముఖ్య అతిధి వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ -“అమ్మ‌మ్మ ఇంట్లో మావ‌య్య‌లు బాగా చూసుకుంటారు. అందుకని ఈ సినిమా బాగా ఆడుతుంది. టైటిల్ విన‌గానే మా అమ్మ‌మ్మ గారి ఊరు గుర్తొచ్చింది“ అని అన్నారు.

User Comments