6 గంటలకు కోటి అడిగిన హాట్ హీరోయిన్..!

 

పేరుకే బ్రిటిష్ బ్యూటీ అయినా ఇండియన్ సినిమాకు ఇంటా బయటా హాట్ హీరోయిన్ గా మారిపోయిన అమీ జాక్సన్ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో అయితే ఎవడు, విక్రమ్ ఐ సినిమాలతో తన హాట్ నెస్ చూపించిన అమీ.. తమిళ, హిందీ భాషల్లో మాత్రం కొంచెం ఎక్కువే చూపించిందని చెప్పొచ్చు. ప్రస్తుతమైతే సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 సినిమాతో పాటు ఓ ఇంగ్లీష్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో పెద్దగా బిజీగా లేని అమీ.. చేతిలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలను పెట్టుకోలేక పోయింది. అయితే, బయట ఇంటర్నెట్ ను వేదికగా చేసుకుని.. బికినీ ఫోటో షూట్లు, కొత్త కొత్త ఫ్యాషన్ వస్త్రాల పేరిట హాట్ షో లు, బీచ్ లో విహరిస్తూ తన అందాలను సోషల్ మీడియాలో పెట్టడం.. మొత్తంగా ఇలాంటి వాటిలో ఈ హాట్ సెక్సీ బ్యూటీకి మంచి పనితనం ఉండటంతో కెరీర్ ను బాగానే లాక్కొస్తుంది.
అందులో భాగంగానే ఈ సెక్సీ బ్యూటీ తాజాగా ఓ బ్రాండింగ్ పేరిట ఒక్క కాల్షీట్ కోసం కోటి రూపాయలు అడిగిందంటేనే.. అమ్మడు ఏ రేంజ్ లో లెక్కలు వేస్తుందో అర్థమైపోతుంది. బడా స్టార్లు కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఏడాది ఒప్పందానికి కోట్లు అడుగుతుంటే.. అమీ జాక్సన్ మాత్రం ఓ కార్పొరేట్ కంపెనీ తన ప్రోడక్ట్ బ్రాండింగ్ కోసం ఫోటో షూట్ పేరిట ఓ ఆరు గంటల కాల్షీట్ అడిగితే ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందట. దీంతో మొత్తంగా 3 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే పెట్టుకున్న ఆ కార్పొరేట్ కంపెనీ.. అమీ కోటి అడిగేసరికి కళ్ళు బైర్లు కమ్మి చివరకు ఇంకో కోటి ఎక్స్ ట్రా భరించగలమా అన్న సందిగ్ధంలో పడిపోయారని సమాచారం. ఏదిఏమైనా, సోషల్ మీడియాలో కావాలనే విచ్చలవిడిగా అందాలు దారబోసే అమీ జాక్సన్ ఇలా యాడ్ ఏజెన్సీ వాళ్ళను మాత్రం ఆరు గంటలకు కోటి అడగడం అంటే.. అది నిజంగా పెద్ద షాక్ అనే అనాలి. అయితే, అమీ జాక్సన్ బ్యాచ్ మాత్రం ఈ విషయంలో పని బట్టే రేటు ఉంటుందని తమ వాదనను వినిపిస్తుండటం గమనార్హం.