బాయ్ ఫ్రెండ్ తో దొరికిన హీరోయిన్

Last Updated on by

మ‌న హీరోయిన్లు ఎంత చూపించినా కూడా ఎక్క‌డో ఓ చోట బ్రేకులేస్తారు. కానీ ఫారెన్ నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌ల‌కు అలాంటి ప‌ట్టింపులేవీ ఉండ‌వు. ఇప్పుడు అమీజాక్స‌న్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ అమ్మ‌డుది మ‌న దేశం కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. ఎక్క‌డో లండ‌న్ నుంచి వ‌చ్చి ఇక్క‌డ తిష్ట వేసింది అమీజాక్స‌న్.


అదృష్టం బాగుండి సూప‌ర్ స్టార్స్ కూడా పిలిచి ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే విక్ర‌మ్, అక్ష‌య్ కుమార్, చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోల‌తో న‌టించింది. ఈ మ‌ధ్యే ఏకంగా ర‌జినీకాంత్ తో జోడీక‌ట్టింది. ఈమె న‌టించిన 2.0 షూటింగ్ పూర్తై.. ఎప్పుడు విడుద‌ల అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉంది.


ఇక ఇప్పుడు ఇండియ‌న్ సినిమాతో త‌న బంధం తెంచేసుకుని సొంత దేశం వెళ్లిపోయింది అమీజాక్స‌న్. అక్క‌డ హాయిగా బికినీలు వేసుకుని.. బాయ్ ఫ్రెండ్ తో బీచ్ ల వెంట తిరుగుతుంది. తాజాగా విడుద‌లైన కొన్ని ఫోటోలు చూస్తుంటే వామ్మో అమీ.. ఏంద‌మ్మీ ఇది అనుకోక త‌ప్ప‌దు.


ఈ మ‌ధ్య అమీ పేరు వింటేనే గుండెల్లో గుబులు మొద‌ల‌వుతుంది. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. ప్ర‌తీ ఫోటోలో బికినీతో చంపేసింది అమీ. ఈ అందాల హై టెన్ష‌న్ చూసి అంతా అటెన్షన్ అయిపోతున్నారు. ఈ ఫోటోషూట్ లో కెమెరాతో అందాల అమీ తుమీ తేల్చేసుకుంది.


ఈ బ్యూటీ బ్యూటీని చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తాయి. మ‌న హీరోయిన్లు ఎంత‌గా రెచ్చిపోయినా.. మ‌రీ ఇంత‌గా మాత్రం రెచ్చిపోరేమో..? ఈ అందాల ఆర‌బోతే అమ్మ‌డు కెరీర్ ను క‌వ‌చంలా కాపాడుతుంది మ‌రి..!

User Comments