పిక్ టాక్‌: `మ‌మ్మీ`ల‌కే మ‌తి చెడాలి!

Last Updated on by

లేడీ రోబోట్‌గా అభిమానుల ముందుకు రాబోతోంది ఎమీజాక్స‌న్. ఎమీ న‌టించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `2.ఓ` నవంబ‌ర్ 29న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అంటే మ‌రో 90రోజుల్లోనే శంక‌ర్ స్టైల్‌ విజువ‌ల్ ట్రీట్‌లో ఎమీజాక్స‌న్‌ని కొత్త‌గా చూడ‌బోతున్నాం. ఇప్ప‌టికే 2.ఓ కౌంట్‌డౌన్ మొద‌లైంది. సౌత్‌లో త‌మిళ్‌, తెలుగులో భారీ చిత్రాల్లో న‌టించిన ఎమీ జాక్స‌న్ త‌దుప‌రి మ‌ల‌యాళ రంగంలోనూ ప్ర‌వేశిస్తోంది. మ‌రోవైపు బ్రిటీష్ బోయ్‌ఫ్రెండ్ జార్జిని పెళ్లాడే ఆలోచ‌న‌లోనూ ఉందన్న ప్ర‌చారం సాగుతోంది.

తాజాగా మ‌రో హాట్ ఫోటోతో అభిమానుల‌కు ట‌చ్‌లోకి వ‌చ్చింది. లేటెస్టుగా ఎమీజాక్స‌న్ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో మ‌రోసారి త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డింది. ఈజిప్ట్ మ‌మ్మీల‌కే మ‌తి చెడే ఫోజుతో చెల‌రేగిపోయింది ఈ అమ్మ‌డు. ఎమీ ఎక్స్‌పోజింగ్ ప‌రాకాష్ట‌కు చేరుకుంది ఈ ఫోటో. బ్రిటీష్ టాప్ మోడ‌ల్‌గా త‌న‌కు ఇలాంటివి కొత్తేమీ కాదు కానీ, మ‌రీ ఈ రేంజులో పిచ్చెక్కిస్తుంద‌ని ఊహించ‌లేదెవ‌రూ! పైగా మా అమ్మ‌ను అడిగే ఇలా చేశాన‌ని సెల‌విచ్చింది. “టూమచ్‌గా క‌నిపిస్తున్నానా? అని మ‌మ్మీనే అడిగేశాను. త‌న ఆన్స‌ర్ మోర్ దేన్ ఓకే!“ అంటూ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్‌ను పోస్ట్ చేసింది. ఎమీ కాన్ఫిడెన్స్ అలాంటిది. `మ‌మ్మీ`ల‌కైనా మ‌తి చెడాల్సిందే.

User Comments