బిలియ‌న్ డాల‌ర్‌ సూప‌ర్‌గాళ్‌

ఎమీ జాక్స‌న్ హాలీవుడ్ సూప‌ర్‌గాళ్‌గా అవ‌త‌రించ‌నుందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇన్నాళ్లు టీవీ సిరీస్‌లో మాత్ర‌మే సూప‌ర్‌గాళ్ పాత్ర‌లో అభినయించిన ఎమీజాక్స‌న్‌ని ఒక పూర్తి స్థాయి భారీ బ‌డ్జెట్ చిత్రంలో సూప‌ర్‌గాళ్ పాత్ర‌లో చూడ‌బోతున్నామ‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత డీసీ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలుస్తోంది.

ప్ర‌ఖ్యాత డీసీ(కామిక్ సినిమాల నిర్మాణ‌) సంస్థ నిర్మించే భారీ బ‌డ్జెట్ సినిమాలో ఎమీకి ఛాన్స్ ద‌క్కిందా? లేదా? అంటే ఇప్ప‌టికి ఇంకా స‌స్పెన్స్. తాము తీయ‌బోయే `సూపర్‌మేన్‌` త‌ర‌హా సూప‌ర్ ఉమెన్ సినిమాలో ఎమీ కూడా భాగం కానుంది అన్న సిగ్న‌ల్స్ అయితే ఇచ్చింది. అయితే ఈ భామ‌ను ఫైన‌ల్ కావాల్సి ఉందింకా. ప్రాజెక్టు ప్ర‌స్తుతానికి ఆలోచ‌నల‌ ద‌శ‌లోనే ఉంది. అది నిజ‌మై, ఒక‌వేళ ఈ ఛాన్స్ వస్తే ఎమీ జాక్‌పాట్ ప‌ట్టేసింద‌ని భావించ‌వ‌చ్చు. వండ‌ర్ ఉమెన్ రేంజులో ఎమీకి పాపులారిటీ వ‌చ్చేస్తుంది. అటుపై ఇక అన్నీ సూప‌ర్‌హీరో త‌ర‌హా సినిమాల్లో సూప‌ర్‌గాళ్‌గా త‌ను క‌నిపిస్తుంద‌న్న‌మాట‌. వ‌రుస‌గా బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల సినిమాలు త‌న వెంట క్యూ క‌డ‌తాయ‌న్న‌మాట‌. హాలీవుడ్ లో సిడ‌బ్ల్యూ చానెల్ టీవీ సిరీస్‌లో న‌టించినందుకు ఇప్పుడు అస‌లు సిస‌లైన ప్ర‌తిఫ‌లం ఈ లండ‌న్ బ్యూటీ అందుకోనుంది. ఎమీ జాక్స‌న్ న‌టించిన 2.ఓ న‌వంబ‌ర్ 29న రిలీజ్ కానున్న సంగ‌తి విదిత‌మే.

User Comments