దొర‌సాని హీరో సెకెండ్ మూవీ ఇదే!

స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దొర‌సాని సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇందులో ఆనంద్ స‌రస‌న జీవితా రాజశేఖ‌ర్ చిన్న కుమార్తె శివాత్మిక న‌టిస్తోంది. ఇది ఆమెకు డెబ్యూ మూవీ. కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు. ఇలా కొత్త వాళ్ల‌తో 80వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఒక స్వచ్ఛమైన ప్రేమకథ గా తెర‌కెక్కుతోంది. దీంతో సినిమా ను ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్రెస్టీజియ‌స్ గా తీసుకుని తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే ఆనంద్ మ‌రో సినిమా లైన్ లో పెట్టేసాడు. ఆ సినిమా టైటిల్ `ఆంధ్రా యూత్`. ఓ కాంటెంప‌ర‌రీ పాయింట్ ను ట‌చ్ చేస్తున్నట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఈ చిత్ర ద ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌రు? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

Also Read: Kallallo Kala Varamai Full Lyrical From Dorasani