డబ్బులు ఇవ్వమని చెప్పి తాప్సికి బెదిరింపులు..?

anando brahma producers warning taapsee

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి తిరిగి టాలీవుడ్ పైనే విమర్శలు గుప్పిస్తోన్న ఢిల్లీ భామ తాప్సి పై ఇప్పుడు చాలామందికి ఓ క్లారిటీ వచ్చేసింది. అమ్మడు పెద్ద అవకాశవాది అని, టైమ్ ను బట్టి మాట్లాడుతుందని, యేరు దాటగానే తెప్ప తగలేసే రకం అని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా లైఫ్ ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే అవమానపరిచేలా తాప్సి వ్యవహరించడంతో.. తెలుగునాట ఈ బ్యూటీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఇంకా ముందుకెళితే తనకే నష్టం అని తెలుసుకున్న తాప్సి.. చివరకు తప్పైపోయిందంటూ క్షమాపణలు చెప్పుకొచ్చింది.
అయితే, దానికంటే ముందు మాత్రం.. తన కామెంట్స్ తో రాఘవేంద్రరావు గారికే ఇబ్బంది కలగలేదని, అలాంటప్పుడు మీకేం నెప్పి అన్నట్లు, తానేమీ తప్పు చేయలేదని, ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన పని లేదని తాప్సి తన స్టైల్లోనే ఎప్పటిలాగే తనను తాను సమర్థించుకున్న విషయం తెలిసే ఉంటుంది. మరి అలాంటప్పుడు తిరిగి క్షమాపణలు ఎందుకు చెప్పింది అనే డౌట్ రావొచ్చు. ఈ నేపథ్యంలో కొంతమందైతే.. తెలుగులో తాప్సి లేటెస్ట్ మూవీ ‘ఆనందో బ్రహ్మ’ రిలీజ్ కు రెడీగా ఉంది కాబట్టే సారీ చెప్పిందని, లేదంటే అసలు పట్టించుకోదని ఓ అంచనాకు వచ్చారు. ఇక ఇప్పుడు ఆ అంచనా నిజమన్నట్లు న్యూస్ రావడమే కాకుండా అంతకుమించి అన్నట్లు ఓ షాకింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఆ స్టోరీలోకి వెళితే, తాప్సి కామెంట్స్ తో హర్ట్ అయిన కొంతమంది ఆమె లేటెస్ట్ మూవీ ‘ఆనందో బ్రహ్మ’ ను టార్గెట్ చేసే దిశగా అడుగులు వేసిన విషయం తెలిసే ఉంటుంది. దీంతో ముందు కంగారుపడ్డ నిర్మాతలు.. సినిమా ఇబ్బందుల్లో పడేలా ఉందని, కొంతమంది బాయ్ కాట్ చేస్తామని అంటున్నారని, అందుకే సారీ చెప్పేస్తే బాగుంటుందని తాప్సిని కోరారట. అయినా సరే ముందు తాప్సి సారీ చెప్పేదే లేదు అన్నట్లు బిహేవ్ చేసిందట. దీంతో సీరియస్ అయిన నిర్మాతలు.. నీ కామెంట్స్ వల్ల ‘ఆనందో బ్రహ్మ’ సినిమా రిలీజ్ కు ఏమైనా ఇబ్బంది ఏర్పడినా, ఒకవేళ సినిమాను వ్యతిరేకించి జనాలు చూడకూడదని డిసైడ్ అయినా బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని తాప్సికి హెచ్చరికలు జారీ చేశారట. అంతేకాకుండా ఏమైనా తేడా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో రావాల్సిన డబ్బులకు ఎసరు పెట్టి కొంచెం గట్టిగానే బెదిరించేసరికి దిగొచ్చిన తాప్సి అందరికీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఈ విధంగా డబ్బులు ఇవ్వమని చెప్పి బెదిరించి ఆనందో బ్రహ్మ నిర్మాతలు తాప్సి పొగరును కొంత అణిచారని గుసగుసలు వినిపిస్తున్నాయి.