అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే

సీమ బిడ్డ‌లు… అనంత‌పురం వాసుల‌కు శుభ‌వార్త‌. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డం ఓ సంచ‌ల‌నం అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టును 27,300కోట్లతో(అంచనాతో) అనంతపురం-కడప-కర్నూల్-ప్రకాశం-గుంటూరు జిల్లా పరిధిలో 600 కి.మీ దూరం 6/4 లైన్స్ తో కేంద్రమే చేపట్ట‌నుంది. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆంధ్రప్రదేశ్ ఓకే చెప్పింది. ఈ హైవే ప్రత్యేకత 120కి.మీ వేగం తో ప్ర‌యాణించే వెసులుబాటుతో ఈ రహదారిని నిర్మించనున్నారు.

రాజ‌ధానికి ర‌హ‌దారి వెసులుబాటు అంటే సీమ‌కు క‌నెక్టివిటీ పెరిగిన‌ట్టే. ఆ మేర‌కు రాయ‌ల‌సీమ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. కొత్త సీఎం జ‌గ‌న్ త‌న‌దైన మార్క్ యాక్టివిటీస్ తో ఆరంభ‌మే దూకుడు చూప‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.