మంచు ఫ్యామిలీ లోకి హాట్ యాంకర్

తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ గా, టాలెంటెడ్ నటిగా బాగానే పాపులర్ అయిపోతున్న అనసూయ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆ మధ్య ‘క్షణం’ సినిమాతో మెస్మరైజ్ చేసిన అనసూయ.. ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ కూడా చేసి బాగానే మెప్పించింది. అయితే, ఎన్ని చేసినా ఓ ప్లానింగ్ తో చేయడం.. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలకు ఒప్పుకోకుండా తనకు మంచి పేరు తీసుకొచ్చే సినిమాలనే తెలివిగా సెలక్ట్ చేసుకోవడం అనసూయకు కలిసొస్తుంది. ఈ క్రమంలోనే సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రంగస్ధలం 1985’ లాంటి క్రేజీ సినిమాలో కూడా ఓ ముఖ్యమైన పాత్రను అందుకుని ఆ పనిలో బిజీబిజీగా ఉంది. ఇదే సమయంలో బుల్లితెరపై కూడా తీరిక లేకుండా టీవీ షో లు చేస్తూ బాగానే రచ్ఛ చేస్తోంది. ఇక ఇప్పుడేమో వెండితెరపై సత్తా చాటడానికి మరో మంచి ఛాన్స్ అనసూయకు దక్కిందని తెలియడం విశేషం.
ఆ స్టోరీలోకి వెళితే, ఇప్పటికే రంగస్థలం అంటూ మెగా సినిమా ఛాన్స్ కొట్టేసిన అనసూయకు తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి ఓ మంచి ఆఫర్ వచ్చిందట. ఈ మేరకు మంచు విష్ణు – మంచు మోహన్ బాబు కలిసి నటించబోతున్న కొత్త సినిమాలో ఒక పాత్ర కోసం అనసూయను సంప్రదించినట్లు తాజా సమాచారం. అది కూడా రైటర్ మదన్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా కావడం గమనార్హం. ఈ క్రమంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు అనసూయ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. అందుకే మంచు ఫ్యామిలీ స్వయంగా ఫోన్ చేసి మరీ అనసూయకు ఆఫర్ ఇచ్చారని ఇన్నర్ సర్కిల్ లో న్యూస్ హల్ చల్ చేస్తోంది. దీనికి అనసూయ కూడా సానుకూలంగానే స్పందించడంతో.. త్వరలోనే మంచు ఫ్యామిలీ మూవీలోకి అనసూయ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో అనసూయ హాట్ గెస్ట్ రోల్ ఏమైనా చేస్తుందా లేక క్షణం సినిమాలో లాగా అదిరిపోయే పాత్ర ఏమైనా చేస్తుందా అనేది ముందు ముందు చూడాలి.

Follow US