యాంక‌ర్ హేమంత్ కు కారు ప్ర‌మాదం

Anchor Hemanth's Lucky Escape in A Road Accident

న‌టుడు, యాంక‌ర్ హేమంత్ కారు ప్రమాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నాడు. `మ‌హ‌ర్షి` సినిమా స‌క్సెస్ మీట్ కు హాజ‌రై తిరుగు ప్రయాణంలో ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది. రాజ‌మండ్రికి స‌మీపంలోని జ‌గ్గ‌య్య పేట హైవే వ‌ద్ద రోడ్డు మ‌ధ్య‌లోకి ఒక్క‌సారిగా గెదే అడ్డుగా రావడంతో దాన్నిత‌ప్పించే ప్ర‌యత్నంలో అదుపు త‌ప్పి డీవైడ‌ర్ ఢీకొట్టింది. దీంతో కారు ప‌ల్టీలు కొట్టింది. ఘ‌ట‌న‌లో స్వ‌ల్ప‌ గాయాల‌తో హేమంత్ బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇదే మార్గంలో గ‌తంలో చాలా మంది టాలీవుడ్ సెల‌బ్రిటీల కార్ల‌కు ప్ర‌మాదాలు సంబ‌వించ‌డంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవ‌లే న‌టుడు సుధాక‌ర్ కోమాకుల కారు గుంటూరు వ‌ద్ద ప్ర‌మాదానికి గురై స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డ‌గా, ఓ మ‌హిళ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.