అంత‌ర్జాతీయ స్థాయిలో ఫిలింస్కూల్స్‌

Last Updated on by

హైద‌రాబాద్‌లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఫిలింస్కూల్స్ తెరిచి శిక్ష‌ణ అందిస్తున్న సంస్థ‌లెన్నో. అయితే ఫిలింస్కూల్ తెరిస్తే స‌రిపోతుందా? శిక్ష‌ణను అంత‌ర్జాతీయ స్థాయిలో అందించాలంటే స‌ద‌రు సంస్థ‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలేంటి? ఫ‌్యాక‌ల్టీ ఎలా ఉండాలి? వ‌ర‌ల్డ్ క్లాస్ సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుంటూ .. విద్యార్థులు నిరంత‌ర ఫిలింవిద్య‌ను అభ్య‌సించాలంటే ఆ స్కూల్‌కి ఎలాంటి అర్హ‌త ఉండాలి? అంటే.. వీట‌న్నిటికీ ఏకైక స‌మాధానం అన్న‌పూర్ణ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ ఫిలిం&మీడియా (ఏఐఎస్ఎఫ్ఎం). లెజెండ్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు భార్యామ‌ణి అన్న‌పూర్ణ‌ పేరిట ప్రారంభ‌మైన ఈ స్కూల్‌లో అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ అందుబాటులో ఉంది. ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ‌కాలం శిక్ష‌ణ అందిస్తున్న ఏకైక సంస్థ కూడా ఇదే. అందువ‌ల్ల నాణ్య‌త ప‌ర‌మైన ఇబ్బంది ఉండ‌ద‌నే న‌మ్మ‌కంతో ఇక్క‌డ విద్యార్థులు చేరుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌తియేటా త‌మ సంస్థ సాధిస్తున్న ప్ర‌గతిని స‌ద‌రు ఫిలింఇనిస్టిట్యూట్ ప‌బ్లిక్ ముందు, మీడియా ముందు ఎలివేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏఐఎస్ఎఫ్ఎం.. 8 విభిన్న‌మైన ఫిలిం స‌బ్జెక్టుల్లో అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ అందిస్తోంది. బిఎఫ్ఏ, ఎంఏ&ఎంఎంబీఏ వంటి నైపుణ్య వృత్తి విద్యాశిక్ష‌ణ‌ను అందిస్తోంది. గ్రేట్ ఫిలింమేక‌ర్స్ ఇక్క‌డ లెక్చ‌ర్లు ఇస్తుంటారు. తాజాగా ఏఐఎస్ఎఫ్ఎం గ్రాండ్ ఫిలింఫెస్టివ‌ల్ పేరుతో రెండ్రోజుల సెల‌బ్రేష‌న్‌ను అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ పండుగ‌లో అన్న‌పూర్ణ విద్యార్థుల ప్ర‌తిభా పాఠ‌వాల్ని ఆవిష్క‌రించేలా వాళ్ల‌చే రూపొందించిన సినిమాల్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆరంభ కార్య‌క్ర‌మంలో స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌, శేఖ‌ర్ క‌మ్ముల‌, అక్కినేని అమ‌ల‌, అక్కినేని అఖిల్‌, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

అయితే ఇలాంటి స్కూళ్ల నుంచి విద్యార్థులు వాస్త‌వంలో రాణిస్తున్నారా? అన్న ప్ర‌శ్న ఉంటుంది? అయితే సృజ‌నాత్మ‌క రంగంలో ఎవ‌రికి వాళ్లు ట్యాలెంట్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. బేసిక్ శిక్ష‌ణ‌ను మాత్రం ఫిలింస్కూల్స్ అందిస్తాయి అంతే. అటుపై క్రియేటివిటీని నిరూపించుకుని ఎద‌గాల్సి ఉంటుంది. ఫిలింస్కూల్ శిక్ష‌ణ ఉంటుంది కాబ‌ట్టి, ఎవ‌రో ఒక‌రు అవ‌కాశం అయితే ఇస్తారు. ఏదో ఒక శాఖ‌లో ప్ర‌త్య‌క్ష అనుభ‌వం సులువుగా కుదురుతుందని చెప్పొచ్చు.

User Comments