మా సినిమా మ‌రో శ‌త‌మానం భ‌వ‌తి

Last Updated on by

శతమానం భవతి లాంటి గొప్ప సినిమా తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఆ స్థాయి సినిమా ఏదీ రాలేదు. అందుకే ఇంటిల్లిపాదికీ అలాంటి అద్భుతమైన అనుభూతి కలిగే సినిమాను అందించాలనే ఉద్దేశంతో ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురా బోతున్నాం. ఇది కచ్చితంగా ‘శతమానం భవతి’ లాంటి గొప్ప సినిమా అవుతుంది’’ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్‌ మామిడాల శ్రీనివాస్‌. బాలాజీ సానల దర్శకత్వంలో నవీన్‌ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్‌, మేఘా చౌదరి, సోఫియా సింగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. రోవాస్కైర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్‌.ఎన్‌. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను శ్రీరాజేశ్వరి ఫిల్మ్స్‌ బ్యానర్‌, మూవీ మ్యాక్స్‌ అధినేత మామిడాల శ్రీనివాస్‌ దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేను అపరిచితుడు, ‘శివపుత్రుడు’ తదితర 20 సినిమాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. అలాగే 4 సినిమాలను ప్రొడ్యూస్‌ చేశాను. ఆ అనుభవంతోనే ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ కొన్నాను. ఆ సినిమా చూడగానే ‘శతమానం భవతి’ లాంటి గొప్ప చిత్రం అవుతుందనిపించింది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. మూవీ మ్యాక్స్‌ ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసురాబోతున్నాం. కోట శ్రీనివాసరావు, అవసరాల శ్రీనివాస్‌, జయసుధ, రావు రమేష్‌, అన్నపూర్ణమ్మ లాంటి పెద్దపెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాకు ప‌నిచేసారు. త్వరలోనే ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించబోతున్నాం. ఒక స్టార్‌ హీరో గెస్ట్‌గా రాబోతున్నారు. ప్రముఖ హీరోతో సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇప్పించబోతున్నాం. ఈ చిత్రాన్ని విజయనిర్మలగారికి అంకితం ఇస్తున్నాం’’ అని చెప్పారు.


Related Posts