మ‌మ్మ‌ల్ని వీడి ఐదేళ్ల‌య్యింది!

Last Updated on by

న‌ట‌శిఖ‌రం .. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్వ‌ర్గ‌స్తులై ఇప్ప‌టికే ఐదేళ్ల‌వుతోంది. 5వ వర్థంతి  సంద‌ర్భ ంగా ఏఎన్నార్ అభిమానులు ఆయ‌న‌కు ఎప్ప‌టిలానే శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.  తన తుదిశ్వాస విడిచే వరకూ నటించాలనే కోరికను నిజం చేసుకున్న ఏఎన్నార్ ఎప్ప‌టికీ అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటార‌న‌డంలో సందేహం లేదు. తాను వెళ్లే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చూఛాయ‌గా చెప్పే గుండె ధైర్య ం బ‌హుశా ప్ర‌పంచంలోనే వేరొక న‌టుడికి లేదు అంటే అతిశ‌యోక్తి కాదు! ఆ స‌న్నివేశం మ‌నం చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తెలుగు సినీమీడియాకి క‌నిపించింది. ఆ గుండె ధైర్య ం ఒక్క ఏఎన్నార్ కి మాత్ర‌మే సాధ్య ం.

ఎన్నో విల‌క్ష‌ణ‌ చిత్రాల్లో న‌టించిన ఏఎన్నార్ మనం చిత్రం లో చివరిసారిగా వెండితెరపై కనిపించారు. తన కుమారుడు, మనవళ్లతో కలిసి ఈ చిత్రంలో ఏఎన్నార్ నటించారు. తన తండ్రి వర్థంతి సందర్భంగా అక్కినేని నాగార్జున ట్విటర్ ద్వారా స్ప ందించారు. నీవు మమ్మల్ని వదిలి వెళ్లి ఐదేళ్లవుతోంది. నీ గురించి మేము ఆలోచించినప్పుడల్లా నీతో గడిపిన ఆనంద క్షణాలే గుర్తొస్తాయి. నీ అభిమానులు, కుటుంబం అంతా.. లవ్ యు.. వియ్ మిస్ యు నాన్న అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Related Posts