మ‌నం.. పిక్ చూసారా..?

Last Updated on by

మ‌నం.. తెలుగు ఇండ‌స్ట్రీ టాప్ 20 మూవీస్ లో ఈ చిత్రానికి కూడా చోటు ఉంటుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావ్ లాంటి లెజెండ్ కు ప‌ర్ ఫెక్ట్ వీడ్కోలు ఈ చిత్రం. విక్ర‌మ్ కే కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం విడుద‌లై అప్పుడే నాలుగేళ్లు అయిపోయింది. మే 23, 2014 న విడుద‌లైంది ఈ చిత్రం. అప్ప‌టికే ఏఎన్నార్ చ‌నిపోయి స‌రిగ్గా నాలుగు నెల‌లు అయిపోయింది. విషాదంలో ఉన్న అక్కినేని కుటుంబానికి ఊర‌ట‌నిచ్చింది ఈ చిత్రం. ఇక ఇందులోని ప్ర‌తీ పోస్ట‌ర్.. స్టిల్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. ముఖ్యంగా నాగ‌చైత‌న్య కుర్చీలో కూర్చుని.. నాగేశ్వ‌ర‌రావ్ చిన్న‌పిల్లాడిలా కాళ్ల‌ద‌గ్గ‌ర కూర్చుని.. నాగార్జున కుర్చీ వెన‌క ఉన్న ఫోటో అల‌రించింది.

ఇక నాలుగేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌నంలోంచి మ‌రో పిక్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇది ఎక్క‌డా బ‌య‌టికి రాలేదు. చైతూ కారు లోంచి స్టైల్ గా బ‌య‌టికి దిగుతుంటే.. నాగేశ్వ‌ర‌రావ్ దిగాలుగా ఓ బాక్స్ ప‌ట్టుకుని అదే కారుకు ఆనుకుని ఉంటాడు. ఇక చైతూ అసిస్టెంట్ గా నాగార్జున ఉన్నాడు. ఈ పిక్ లో కూడా చాలా ఎమోష‌న్స్ ఉన్నాయి. అస‌లు అక్కినేని బంధాల‌ను రివ‌ర్స్ చేసి.. మ‌నంలో విక్ర‌మ్ చేసిన ప్ర‌యోగం అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయింది. ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది కూడా. క‌మ‌ర్షియ‌ల్ గా కూడా నిర్మాత నాగార్జున‌కు మంచి లాభాలు తీసుకొచ్చింది.

User Comments