అంత‌రిక్షం లైవ్ అప్‌డేట్స్

Last Updated on by

Last updated on December 27th, 2018 at 07:41 pm

6:50 AM : చ‌ంద్రునిపై నీటిని క‌నిపెట్టారు.. చంద‌మామ‌పై మ‌నుషుల‌ నివాసంపై ఆపరేష‌న్ .. మ‌రో మూడేళ్ల‌లో ప్లాన్!!. “ది ఎండ్“.

6:47 AM : విప్రాయాన్ సేవ్డ్.. దేవ్ సుర‌క్షితం.. మిష‌న్ కిన్నెర స‌క్సెసైంది.. బ్యాక్ టు ఎర్త్..

6.36 AM : విప్ర‌యాన్ ప‌య‌నంలో టెన్స‌న్ టెన్స‌న్‌

6:30 AM : మిష‌న్‌లో స‌మ‌స్య‌లు.. గ్రౌండ్ స్పేస్ సెంట‌ర్‌ నుంచి క‌నెక్ష‌న్ మిస్.. వ్యోమ‌గాముల‌కు చావో బ‌తుకో తేల్చుకునే సీన్.. ఏం జ‌రిగినా ముందుకే వెళ్లాల‌ని నిర్ణ‌యం.

6:20 AM : చ‌ంద్రునిపై మిష‌న్ కిన్నెర .. సాంగ్ టైమ్ .. అంత‌రిక్ష యానం…

6:15 AM : దేవ్ త‌న ప‌నిలో తాను ఉన్నాడు.. సెంటిమెంట్ సీన్లు.. విప్రాయాన్ సేవింగ్ సీక్వెన్సుల్లో సినిమాటిక్ లిబ‌ర్టీ టూమ‌చ్..

6:11 AM : గ‌్రౌండ్ స్టేష‌న్ కి విచ్చేసిన‌ ఛీఫ్.. సెకండాఫ్‌లో కొన్ని ఆస‌క్తిక‌ర మూవ్‌మెంట్స్‌తో స‌న్నివేశాలు.. గ్రాఫిక్స్ ఓకే ఫ‌ర్వాలేదు.. హాలీవుడ్ ప్ర‌మాణాలు అన‌ద‌గ్గ స్థాయిలో అయితే లేవు..

6:06 AM : మ‌రో కొత్త స‌మ‌స్య‌.. గ‌తంలో విప్రాయాన్ మిస్టేక్‌ని ఫిక్స్ చేసిన వైనం గుర్తు చేసుకుంటున్న దేవ్‌..

6:00 AM : దేవ్ సేఫ్‌.. జీరో గ్రావిటీలో స‌న్నివేశం… గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో కుద‌ర‌లేదు.. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు మ‌రింత బెట‌ర్‌గా ఉంటే బావుండేది..

5:55 AM : రెండో ప్ర‌య‌త్నం ఫెయిల్.. అంత‌రిక్షంలో స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న‌ దేవ్ .. చివ‌రికి ఆప‌రేష‌న్ స‌క్సెస్!!!

5.50 AM : స‌్పేస్‌లో అస‌లు మిష‌న్ మొద‌లు.. మిహిర స‌మ‌స్య ప‌రిష్కారం కోసం దేవ్‌ టీమ్ ప్ర‌య‌త్నాలు ఫెయిల్‌. మిహిరపై చైనీస్ కుట్ర కోణంపై చ‌ర్చ‌..

ఫ‌స్టాఫ్ ఓకే. క‌థ స‌జావుగానే ర‌న్ అవుతోంది.. అస‌లు మిష‌న్ మొద‌ల‌య్యేది సెకండాఫ్‌లోనే.. అస‌లు క‌థంతా ఇక‌పైనే .. స్టే ట్యూన్ టు మై ఫ‌స్ట్ షో

5:40 AM :  మిహిర స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు న‌లుగురు వ్యోమ‌గాముల‌తో కూడిన `జ‌త‌యు` స్పేస్‌లోకి బ‌య‌ల్దేరింది. ఈ మిష‌న్ కోసం దేవ్ ఆన్ బోర్డ్ వ‌చ్చాడు..

5:25 AM : గ‌తం నుంచి వ‌ర్త‌మానంలోకి.. వ‌ర్త‌మానం నుంచి గ‌తంలోకి స‌న్నివేశాలు.. మిహిర స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు స్పేస్‌లోకి వెళ్లాల‌ని దేవ్ నిర్ణ‌యం. కానీ బాస్ నుంచి అడ్డంకులు.. కుట్ర‌లు..

5:20 AM : దేవ్ తిరిగి ప‌నిలో చేరాడు.. స‌న్నివేశాలు నెమ్మ‌దిగా సాగుతున్నాయి..

5:15 AM : దేవ్ జీవితంలో ట‌ర్న్‌పై కార‌ణం రివీల్.. అత‌డి జీవితంలో డ‌బుల్ ట్రాజెడీ..

5:05 AM : `విప్రాయ‌న్` లాంచ్ స‌క్సెస్‌.. ప్ర‌స్తుతంలోకి స‌న్నివేశం.. దేవ్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచ‌ర్‌గా ఉద్యోగం… 3 ఇడియ‌ట్స్ ఇన్‌స్పిరేష‌న్ సీన్?

5:00 AM : తొలి పాట .. వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య‌పై స‌మ‌య‌మ గీతం..

4:55 AM : బెంగ‌ళూరు స్పేస్ సెంట‌ర్‌లో స‌న్నివేశం మొద‌లు.. లావ‌ణ్య త్రిపాఠి టీచ‌ర్‌గా ఆరంగేట్రం..

4:45 AM : ట‌్ర‌బుల్ షూటర్ దేవ్ (వ‌రుణ్ తేజ్) వేట మొద‌లు… ఫ్లాష్ బ్యాక్ మొద‌లు..

4:40 AM :   ఏఎం: అమెరికా, ఇండియాలో శాటిలైట్ ట్రాకింగ్ కేంద్రాలు… శాటిలైట్ మిహిర‌ను ట్రాక్ చేయ‌లేక‌పోతాయి. సైంటిస్ట్ అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఆరంగేట్రం.. మిహిర టీమ్‌లో వ్యోమ‌గామిగా అదితీరావ్ హైద‌రీ ప‌రిచ‌యం…ఏపీలోని రాకెట్ లాంచ్ సెంట‌ర్‌కి క‌థ మారుతుంది…

4:30 AM: భార‌త‌దేశం శాటిలైట్‌ని లాంచ్ చేస్తున్న దృశ్యంతో సినిమా మొద‌లు.. చంద్రుని క‌క్ష‌లోకి శాటిలైట్‌ని ప్ర‌వేశ‌పెట్టే ఘ‌ట్టం. చుక్క‌ల్లో టైటిల్స్‌.. వ‌యొలిన్ మ్యూజిక్.. క‌థ ఐదేళ్ల త‌ర్వాత‌కు వెళుతుంది..

21 డిసెంబ‌ర్ వేకువ ఝాము 4.30 ఏఎం (అమెరికాలో 20 డిసెంబ‌ర్ 6పీఎం ఇఎస్‌టీ) నుంచి లైవ్ అప్‌డేట్స్ మీకోసం…

టాలీవుడ్‌లో తొలి స్పేస్ థ్రిల్ల‌ర్ `అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్ డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో డిసెంబ‌ర్ 20 (గురువారం)న ప్రీమియ‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రుణ్ తేజ్- అదితీరావ్ హైద‌రీ- లావ‌ణ్య త్రిపాఠి కాంబినేష‌న్ లో ఘాజి ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క్రిష్- రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

User Comments