న్యూ లుక్: రాక్ష‌సితో మెగా ప్రిన్స్‌

Last Updated on by

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ – అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `అంత‌రిక్షం 9000 కెఎంపిహెచ్`. `ఘాజీ` ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తున్నారు. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కి అభిమానులు, ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న ల‌భించింది. లేటెస్టుగా చిత్ర‌యూనిట్ దీపావ‌ళి కానుక‌గా మ‌రో కొత్త లుక్ ని లాంచ్ చేసింది.

ఈ పోస్ట‌ర్‌లో వ‌రుణ్ తేజ్ పూర్తిగా తెల్ల‌ని ధ‌వ‌ల‌వ‌స్త్రాల్లో త‌ళ‌త‌ళ మెరిసిపోతున్నాడు. ఆర‌డుగుల ఆజానుభాహుడిగా మైమ‌రిపిస్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి దీపాల కాంతిలో మైమ‌రిపిస్తోంది. ఈ జోడీ ఈడూ జోడూ కుదిరింది. మైమ‌రిపించే కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి అంత‌రిక్షం లో సెంటిమెంటుకు ఆస్కారం ఉంద‌ని ఈ పోస్ట‌ర్ చెబుతోంది. డిసెంబ‌ర్ డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.
దీపావ‌ళి కానుక‌గా వ‌రుణ్‌తేజ్ ఫ్యాన్స్‌కి వెల్ ట్రీట్ ఇది.

User Comments