అనూ బేబి సిస్ట‌ర్ క‌మింగ్‌

Last Updated on by

మ‌ల‌యాళ బొద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ వ‌రుస సినిమాల‌తో టాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అజ్ఞాత‌వాసి ఫెయిల్యూర్ త‌ర్వాత `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రంతో త‌న అదృష్టం ప‌రీక్షించుకునేందుకు వ‌స్తోంది. ఈనెల 31న ఈ సినిమా రిలీజ్‌కి వ‌స్తోంది. ఇటీవ‌లే ఈ సినిమాలోని కొన్ని పాట‌లు రిలీజై ఆక‌ట్టుకున్నాయి. అనూ బేబి సాంగ్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఈలోగానే అనూ సిస్ట‌ర్ తెరంగేట్రంపై టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అనూ సిస్ట‌ర్ మోనికా జాన్ రెబా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ భామ ఇప్ప‌టికే మ‌ల‌యాళం, త‌మిళ్‌లో ఓ రెండు సినిమాల్లో న‌టించింది. టాలీవుడ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న జెర్సీ అనే చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభిన‌యం చేయనున్నాడ‌ని తెలుస్తోంది. చారెడేసి క‌ళ్ల‌తో గుండెకు గాలం వేసి లాగేస్తున్న అనూ బేబి సిస్ట‌ర్‌ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంద‌నే ఆశిద్దాం.

User Comments