సెక్సీ అసిస్టెంట్ తో పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా కొంచెం బిజీగానే ఉన్నా.. మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్లో తన కొత్త సినిమాతో కూడా గడిపేస్తోన్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో పవన్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి బాస్ గా కనిపించనున్నాడని ఇంతకుముందే చెప్పుకోవడంతో.. ఇప్పుడు దానికోసం పవన్ కొంచెం సన్నబడి మరింత అందంగా తయారయ్యాడని అంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి అప్డేట్స్ కొన్ని బయటకు రాగా, ఇప్పుడు ఓ హాట్ అప్డేట్ సినీ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఆ స్టోరీలోకి వెళితే, ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో మలయాళీ బ్యూటీ అను ఎమ్మాన్యుయల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసే ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో అను క్యారెక్టర్ గురించి కొన్ని అప్డేట్స్ బయటకొచ్చాయి. ఈ సెక్సీ కళ్ళ సుందరి సినిమాలో బాస్ గా నటిస్తోన్న పవన్ కు అసిస్టెంట్ గా నటిస్తోందట. అంతేకాకుండా హీరో అంటే విపరీతమైన లైకింగ్ ఉన్న అమ్మాయిగా కనిపించనుందట.

అంటే, ఆర్య-2 లో శ్రద్ధాదాస్ పాత్ర తరహాలో పవన్ సినిమాలో అను ఎమ్మాన్యుయల్ రోల్ ఉంటుందట. అయితే, ఇందులో ఈ యంగ్ బ్యూటీ మరింత సెక్సీగా కనిపించబోతుందట.

ఈ క్రమంలోనే రీసెంట్ గా అనుపై కొన్ని సీన్స్ ను షూట్ చేస్తే.. యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయిందట. ప్రధానంగా అను గ్లామర్ కు అందరూ ఫిదా అయిపోయారని చెబుతున్నారు.

ముఖ్యంగా పవన్ మరియు అనుల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ తరహా సరదా సన్నివేశాల్లో.. మనం కొత్త అనును చూడబోతున్నామని అంటున్నారు. ఈ మేరకు ఆయా సీన్స్ కు అను తనదైన గ్లామర్ తో పాటు డిఫరెంట్ స్టైల్ ను కూడా కలగలిపిందని చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకే ఈ సీన్స్ సినిమా వినోదంలో హైలైట్ అయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నారు.

మొత్తంగా ఇప్పుడు సెక్సీ అసిస్టెంట్ తో పవన్ అదిరిపోయే కామెడీ అండ్ రొమాన్స్ పండించాడని అర్థమైపోతుంది. మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి ఇది ఎంతవరకు నిజమో.

Follow US