ఐస్మార్ట్ శంక‌ర్‌తో అనూ

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పూరి క‌నెక్ట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం `ఐస్మార్ట్ శంక‌ర్` ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ప్ర‌స్తుతం కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ సాగుతున్నాయి. ఛార్మి స్వ‌యంగా ఈ బాధ్య‌త‌ల్ని చేపట్టార‌ని తెలుస్తోంది.
ఆస‌క్తిక‌రంగా ఈ టీమ్ తో అను ఇమ్మాన్యుయేల్ జాయిన్ అయ్యింద‌ని తెలుస్తోంది. అను ఆరంభ‌మే నాని స‌ర‌స‌న మ‌జ్ను, రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న‌ కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చిత్రాల్లో న‌టించి హిట్లు అందుకున్నా, అటుపై స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుని వ‌రుస ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న అజ్ఞాత‌వాసి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న నా పేరు సూర్య చిత్రాల్లో అను ఇమ్మాన్యుయేల్ న‌టించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ ఫ‌లితాలు అందుకున్నాయి. ఆ క్ర‌మంలోనే అను కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌బ‌డింది. అయినా పూరి – రామ్ – ఛార్మి ట్ర‌యో పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చార‌ని తెలుస్తోంది. ఈ ఆఫ‌ర్ గురించి ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.