Last Updated on by
క్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన రీసెంట్ సినిమాలేవీ విజయం సాధించలేదు. రామ్ సరసన ఉన్నది `ఒకటే జిందగీ`, హలో గురూ ప్రేమకోసమే చిత్రాలు ఫ్లాపులయ్యాయి. తేజ్ ఐ లవ్ యు, యుద్ధం శరణం వంటి ఫ్లాపులు అనుపమ కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యాయి. వరుసగా అరడజను ఫ్లాపులు బాగా ఇబ్బంది పెట్టేశాయి. ఆ క్రమంలోనే ఇటు తెలుగు సినీపరిశ్రమను వీడి కన్నడలో ఓ ట్రయల్ వేసింది. అక్కడ కూడా ప్రేమమ్ తరహాలోనే ఈ అమ్మడికి డెబ్యూ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పైగా పునీత్ రాజ్ కుమార్ సరసన నటించిన నట సార్వభౌమ తో ఎంట్రీ ఇవ్వడం అనుపమకు అక్కడ పెద్ద ప్లస్ కానుందని చెబుతున్నారు.
అలాగే అనుపమకు ప్రస్తుతం కన్నడలో క్రేజీ ఆఫర్లు వెల్లువెత్తనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలోనే హిట్టొచ్చిన వేళ ఈ క్యూటీ వరుసగా ఇన్ స్టాగ్రమ్ లో రకరకాల ఫోటోల్ని అభిమానుల కోసం షేర్ చేసింది. పునీత్ తో ఆన్ లొకేషన్ స్టిల్స్ తో పాటు సెల్ఫీలు, వీడియోలు అంటూ రకరకాలుగా ఈ ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేయడంతో అవి కాస్తా ప్రస్తుతం జోరుగా వైరల్ అయిపోతున్నాయి. అందులో గ్లింప్స్ అనిపించే ప్రతి ఫోటోని యూత్ తరచి తరచి చూస్తున్నారు. అసలే క్యూటీ.. ఆపై నాటీ.. దీంతో అనుపమ వెంట పడిపోతున్నారంతే. అన్నట్టు అనుపమ అక్కడ హిట్టు కొట్టింది కాబట్టి తిరిగి ఇక్కడికి వస్తుందా.. రాదా? అన్నది చూడాలి.
User Comments