తేజ్ కాదు.. లాల్ ప్రేమ‌లో

Last Updated on by

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.. కుర్ర‌కారు గుండెల్లో క‌వ్వింత‌.. తుళ్లింత‌. మ‌న‌సు మాట విన‌దు… వేళ‌కు నిదుర ప‌ట్ట‌నివ్వ‌దు.. అంతే కాదు ఇంట్లో ఎదురించేంత తెగువ‌కు కార‌ణమ‌య్యే అందం అనుప‌మ‌. అందుకే నటించిన తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో పాగా వేసింది. అటుపై ఇక్క‌డ తిరుగులేని హ‌వా సాగిస్తోంది. క్యూట్‌గా క‌వ్విస్తూనే.. హాట్ అప్పియ‌రెన్స్‌తో మ‌తులు చెడ‌గొడుతోంది ఈ అమ్మ‌డు. ప్ర‌స్తుతం యువ‌హీరోల‌కు ఏకైక ఆప్ష‌న్‌గా వెలిగిపోతోంది. ఇప్ప‌టికిప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌, రామ్ వంటి ఎనర్జిటిక్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. రామ్ స‌ర‌స‌న `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` చిత్రంలో న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అటుపై ప్ర‌స్తుతం `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` చిత్రంలో న‌టిస్తోంది. అలానే సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న తొలిప్రేమ క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న `తేజ్‌… ఐ ల‌వ్ యు` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాలో తేజ్‌పై మ‌న‌సు పారేసుకునే అమ్మ‌డిగా న‌టిస్తోందిట‌.
anupama loves senior hero
అయితే .. ఇదిగో ఈరోజు అనుప‌మ ట్విట్ట‌ర్ వెతికితే త‌ను అటు రామ్‌తో కానీ, ఇటు తేజ్‌తో కానీ ప్రేమ‌లో ప‌డిన‌ట్టే క‌నిపించ‌డం లేదు. పైగా సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌లాల్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు అర్థ‌మైంది. సూప‌ర్‌స్టార్‌ మోహ‌న్‌లాల్ యువ‌కుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డి రూపాన్ని, కెరీర్‌ని ఎలివేట్ చేసే పోస్ట‌ర్‌ని అనుప‌మ ట్వీట్ చేసింది. ఫైనెస్ట్ యాక్ట‌ర్‌.. నిజ‌మైన స్ఫూర్తి.. అంటూ కామెంట్‌ని పోస్ట్ చేసింది. అంటే త‌న సినిమాలు అంత పిచ్చిగా చూసేదానిన‌ని చెప్ప‌క‌నే చెప్పింది ఈ క్యూటీ. మొత్తానికి లాల్ స‌ర్‌ మాయ‌లో ప‌డి.. యువ‌కులైన తేజ్‌, రామ్‌ల‌ను మ‌ర్చిపోవ‌డం అన్యాయం అంటూ యూత్ తెగ ఇదైపోతున్నారిప్పుడు.

User Comments