అనుప‌మ పెళ్లికూతురు

Last Updated on by

కాటుక క‌ళ్లు.. చెవికి జూకాలు.. నుదిటిన పాపిడి బొట్టు.. అందంగా ఆ స్మైల్ .. ఈ ల‌ల‌నామ‌ణిని చూడ‌గానే ప‌డిపోకుండా ఉంటారా? ఇప్ప‌టికే  తెలుగు కుర్రాళ్లంతా ఎప్పుడో ప‌డిపోయారు అనుప‌మ‌కు. అయితే త‌న‌ని ఆరాధించే బోయ్స్ అంద‌రికీ ఇదో షాకింగ్ న్యూస్. అందాల అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెళ్లి కూతురైంది. ఇంత‌లోనే పెళ్లేంటి?  స‌డెన్ షాక్ అనుకుంటున్నారా?  దీపిక‌, పీసీని చూసి తొంద‌ర‌ప‌డింద‌నుకున్నారా?
అబ్బే.. ఇది నిజం పెళ్లి కాదులెండి! మ్యాగ‌జైన్ ఫోటోషూట్‌ కోసం జస్ట్ పెళ్లికూతురైంది అంతే. అందంగా అలంక‌రించుకుని …అచ్చం పెళ్లికూతురిలా త‌న‌ని తాను అలంక‌రించుకుని మ‌రీ ఆ మ్యాగ‌జైన్‌కి ఫోజులిచ్చింది. అస‌లే క్యూట్‌గా క‌వ్వించే ఈ ముద్దుగుమ్మ ఇలా పెళ్లికూతురులా చీర‌లో క‌నిపించేస‌రికి కాస్తంత క‌న్ఫ్యూజ్ అయ్యారంతే. వ‌రుస వైఫ‌ల్యాలు ఇబ్బంది పెట్టినా అనుప‌మ‌కు కెరీర్ ప‌రంగా డోఖా ఏం లేదు. తెలుగులో ఇప్ప‌టికి ఛాన్స్ లేక‌పోయినా అటు క‌న్న‌డ‌లో `న‌ట‌సార్వ‌భౌమ` అనే చిత్రంలో న‌టిస్తోంది. లేటెస్టుగా వెడ్డింగ్‌వావ్స్ అనే మ్యాగ‌జైన్‌కి ఇలా ఫోజిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

User Comments