చీర క‌ట్టిన అనుప‌మ‌..!

Last Updated on by

ఇది అస‌లే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ. ఇక్క‌డ రోజుకో హీరోయిన్ వ‌స్తుంటుంది. అందాలు ఆర‌బోయ‌ను.. మ‌డి క‌ట్టుకుని కూర్చుంటాను అంటే ఇక్క‌డ నెగ్గుకు రావ‌డం క‌ష్టం. కానీ కొంద‌రు ముద్దుగుమ్మ‌లు మాత్రం ఇప్ప‌టికీ చూపించ‌కుండానే స్టార్ హీరోయిన్లు అయిపోతున్నారు. నిండా క‌ప్పుకుని మ‌న‌సు దోచుకుంటున్నారు. ఈ లిస్ట్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ముందు వ‌ర‌సలో ఉంటుంది. అ..ఆ.. ప్రేమ‌మ్.. శ‌త‌మానం భ‌వ‌తి మూడు సినిమాల‌తో హ్యాట్రిక్ అందుకున్న అనుప‌మ‌.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, కృష్ణార్జున యుద్ధంతో వెన‌క‌బ‌డింది.

anupama parameshwaran latest hottest photo shoot

ప్ర‌స్తుతం తేజ్ ఐ ల‌వ్ యూతో ఫామ్ లోకి రావాల‌ని చూస్తుంది అనుప‌మ‌. ఇదిలా ఉండ‌గానే తాజాగా చీర‌లో చ‌క్క‌గా ఓ ఫోటోషూట్ చేసింది అను. అమ్మాయిలు చీర క‌ట్టుకుంటే ఇంత బాగుంటారా అనే విధంగా చూపుల‌తోనే చంపేసింది ఈ అందాల చంద‌మామ‌. ముఖ్యంగా న‌డుము ద‌గ్గ‌ర చేతులు పెట్టుకుని అలా స్టైల్ గా నిల‌బ‌డి ఉంటే ఆ ఒంపుల్లో ప‌డి పాపం న‌లిగిపోయిన కుర్ర ప్రాణాలెన్నో..! అంత‌గా ఊరించింది ఈ జ‌ఘ‌నం. చీర‌లోనే అందమంత ఉన్న‌ది అంటూ చూపించ‌కుండానే ఉన్న అన్ని ప్రాణాలు తీసేసింది అనుప‌మ‌. ఈ టైమ్ లో కానీ ఒక్క హిట్ ప‌డితే అనుప‌మ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటుంది ఈ ప్రేమ‌మ్ భామ‌.

anupama parameshwaran latest hottest photo shoot

User Comments