మెగా కంపౌండ్ లోకి వెళ్తున్న అనుప‌మ‌

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఈ పాటికి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టార్ హీరోయిన్ అయ్యుండేది. కానీ ఏదీ జ‌ర‌గ‌లేదు అందుకే ఇప్ప‌టికీ ఇలాగే మిగిలిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. చిన్న హీరోల‌తోనే న‌టిస్తూ పెద్ద హీరోయిన్అ వ్వాల‌నుకుంటుంది అనుప‌మ‌. మెగా హీరోల‌తో అప్ప‌ట్లో మంచి అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయాయి. ముందు రంగ‌స్థ‌లంలో అనుప‌మ‌నే తీసుకుని వ‌ద్ద‌నుకున్నారు.. ఆ త‌ర్వాత బ‌న్నీ సినిమాలోనూ ఈమెను అనుకుని కాద‌నుకున్నారు. జై ల‌వ‌కుశ‌లో ముందు నివేదా థామ‌స్ స్థానంలో అనుప‌మ‌నే అనుకున్నారు. ఇలా స్టార్ హీరోలంతా క‌లిసి హ్యాండ్ ఇచ్చినా కూడా నిబ్బ‌రంగా ఉంది అనుప‌మ‌. ఇప్పుడు ఎక్క‌డ పోయిందో అక్క‌డే వెతుక్కుంటుంది.
క్రేజ్ ఉంది క‌దా అని.. అవ‌కాశాలు జోరుగా వ‌స్తున్నా ఏ మాత్రం తొంద‌ర‌ప‌డ‌ట్లేదు అంటుంది అనుప‌మ‌. మెల్ల‌గా ఒక్కో క‌థ విని న‌చ్చిన త‌ర్వాత గానీ సినిమాకు సైన్ చేయ‌న‌ని చెబుతోంది ఈ బ్యూటీ. వ‌ర‌స‌గా సినిమాలు చేసి.. స్టార్ అయిపోవాల‌నే త‌ప‌న త‌న‌కు లేద‌ని చెబుతుంది ఈ కేర‌ళ‌కుట్టి. చేసే ఒక‌ట్రెండు సినిమాలైనా మ‌న‌కు సంతృప్తి ఇవ్వాల‌ని అప్పుడే న‌టిగా త‌న‌కు గుర్తింపు ఉంటుందని చెబుతోంది ఈ బ్యూటీ.
ప్ర‌స్తుతం ఈమె నానికి జోడీగా కృష్ణార్జున యుద్ధం.. సాయిధ‌రంతేజ్-క‌రుణాక‌ర‌ణ్ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ రెండు సినిమాల‌కు తోడు చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమాలోనూ అనుప‌మనే హీరోయిన్ గా తీసుకోవాల‌ని చూస్తున్నారు. మొత్తానికి ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని చూస్తుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.