Last Updated on by
చాలా రోజులైంది.. అనుష్కను స్క్రీన్ పై చూసి. అప్పుడెప్పుడో బాహుబలి 2 తర్వాత మళ్లీ కనిపించలేదు అనుష్క. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ భాగమతి సినిమాతో రానుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు బై ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. 142 నిమిషాల నిడివితో వస్తుంది భాగమతి. అశోక్ తెరకెక్కించిన ఈ చిత్రం హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అరుంధతి తరహాలోనే సాగే ఆత్మకథే ఈ చిత్రం.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కోటికి పైగా వ్యూస్ సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా ట్రైలర్ గా చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. జనవరి 26న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే తమిళనాట ఆడియో విడుదలైంది. సూర్య ముఖ్యఅతిథిగా ఈ వేడుక జరిగింది. ఇక తెలుగులోనూ త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. ప్రభాస్ దీనికి ముఖ్య అతిథిగా వస్తాడని తెలుస్తుంది. యువీ క్రియేషన్స్ భాగమతిని నిర్మించారు. కచ్చితంగా ఈ చిత్రంతో భారీ హిట్ కొడతాననే నమ్మకంతో కనిపిస్తుంది అనుష్క. అంతేకాదు.. ఈ చిత్రం తర్వాత అనుష్క రిటైర్మెంట్ ఇస్తుందేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
User Comments