బొద్దు అందంతో షాకిచ్చిన స్వీటీ

భాగ‌మ‌తి త‌ర్వాత స్వీటీ అనుష్క హైద‌రాబాద్ లో అడుగు పెట్టింది లేదు. ఆ సినిమా రిలీజ్ అనంత‌రం బెంగుళూరులో ఉంటూనే కార్య‌క‌లాపాల‌న్నింటిని న‌డిపించింది. అక్క‌డ నుంచే సైలెన్స్ సినిమా షూటింగ్ కు హాజ‌రవుతోంది. అయితే తాజాగా ఆమె నేడు హైద‌రాబాద్ లో అడుగుపెడుతూనే పెద్ద షాకిచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంట‌నే ఆమె పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. భారీ శ‌రీరంతో బొద్దుగా మారి అభిమానుల‌కు షాకిచ్చింది.

సైలెన్స్ సినిమా కోసం అలా తయారైందా? లేక శ‌రీరం త‌గ్గ‌లేదా? అన్న‌ది తెలియదు గానీ! ఆమెను చూసిన వారంతా మాత్రం అవాక్క‌వ్వాలిందే. గ‌తంలో బాహుబ‌లి సినిమాలో ఒక పాత్ర కోసం లావెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత విదేశాలు వెళ్లి లైపో స‌ర్జ‌రీతో ఒళ్లు త‌గ్గించుకుంది. ఆ స‌న్న‌జాజి పిక్స్ కూడా లీక‌య్యాయి. కానీ తాజాగా మ‌రోసారి బాహుబ‌లి లో పాత్ర‌ను మించి ఒళ్లు చేసిన‌ట్లు క‌నిపించ‌డం…అందులోనూ ముఖానికి మేక‌ప్ లేక‌పోవ‌డంతో షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితి.