అనుష్క‌, హెబ్బా ప‌టేల్ దిష్టిబొమ్మ‌లా?

కొత్త ఇళ్లు అయినా…పాత ఇళ్లు అయినా..ఇంటికి దిష్టి త‌గ‌ల‌కుండా బూడిద గుమ్మ‌డి కాయ‌మీద బొమ్మ‌లేసి దిష్టి బొమ్మ‌గా త‌గిలిస్తుంటాం. న‌రుల క‌ళ్లు ఇంటిమీద ప‌డితే సిరిసంప‌ద‌లు త‌గ్గుతాయ‌నే భావ‌న‌తో అలా చేస్తాం. కానీ తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి చూస్తుంటే ట్రెండ్ మారిన‌ట్లు క‌నిపిస్తుంది. దిష్టి బొమ్మ‌ల‌కు బ‌ధులు హీరోయిన్ బొమ్మ‌ల‌ను కొత్త‌గా క‌న‌స్ర్ట‌క్ష‌న్ అవుతోన్న ఇంటి ముందు క‌ట్ట‌డం విశేషం. మ‌రి ఈ బొమ్మ‌లు దిష్టి కోసం క‌ట్టారా? త‌మ కొత్త ఇల్లును అంద‌రూ చూడాల‌ని ఇలా గ్లామర్ తార‌లు అతికించారా? అన్న‌ది మ్యాట‌ర్లోకి వెళ్తేగానీ తెలియ‌దు.

న‌వ్యాంధ్ర రాజ‌ధాని ఫ‌రిదిలో కొంద‌రు గృహ నిర్మాణుదారులు ఇలా కొత్త‌గా ఆలోచించారు. నిర్మాణంలో ఉన్న త‌మ ఇళ్ల‌కు అనుష్క‌, హెబ్బా ప‌టేల్ గ్లామ‌ర్ ఫోటోల‌ను అంతికించి వార‌త్లొక్కి ఎక్కారు. కొత్త ఇంటికి హీరోయిన్ బొమ్మ‌లేంట‌ని ప్ర‌శ్నిస్తే ఓన‌ర్లు! న‌ర‌దిస్టి త‌గ‌ల‌కుండా ఉండాల‌నే ఇలా చేసాం. ఎవ‌రైనా ఇంటిని చూసే ఆలోచ‌న ఉన్న వారు ముందుగా ఇంటిక‌న్నా? హీరోయిన్ల బొమ్మ‌ల వైపు చూపు వెల్లాల‌నే ఇలా చేసామని తెలిపారు. అమ‌రావ‌తి ఫ‌ర‌దిలోని మంద‌డం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల‌పై ఈ బికినీ ఫోటోలిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. త‌మ ఇంటిని ఎవ‌రూ చూడ‌కూడ‌ద‌ని ఇలా బాగానే ఆలోచించారు. కానీ అనుష్క గొడెక్కితే గాసిపు రాయుళ్లు విశ్వ‌వ్యాప్తం చేయ‌రు. ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. మ‌రి ఈ విష‌యం ఆ హీరోయిన్లిద్ద‌రికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో.