2019లో అనుష్క కొత్త సినిమా

Last Updated on by

స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి గురించి గ‌త కొంత కాలంగా ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. అనుష్క సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే పెళ్లాడేసేందుకు రెడీ అవుతోంద‌ని, బ‌రువు త‌గ్గించుకునేందుకు విదేశాల‌కు వెళ్లింద‌ని సామాజిక మాధ్య‌మాల్లో, మీడియాలో విస్త్ర‌తంగా ప్ర‌చారం సాగింది. ఈ వార్త‌ల్లో నిజం ఎంతో తెలీదు కానీ, అన్నిటికీ చెక్ పెట్టేస్తూ అనుష్క తాను న‌టించే త‌దుప‌రి చిత్రానికి సంత‌కం చేసింది. భాగ‌మ‌తి త‌ర్వాత అధికారికంగా తాను న‌టించే సినిమాకి సంబంధించిన వివ‌రాన్ని స్టార్ రైట‌ర్ కం నిర్మాత కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు.

న‌వంబ‌ర్ 7 దీపావ‌ళి రోజున అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తాను న‌టించే కొత్త సినిమా వివ‌రాన్ని కోన ట్వీట్ చేశారు. బాహుబ‌లి స్టార్ అనుష్క‌తో ప్రాజెక్టు ఖాయ‌మైంది. అమెరికాలో 2019లో ఈ సినిమాని ప్రారంభిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అనుష్క గొప్ప మాన‌వ‌తావాది. త‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని తెలిపారు. కోన ఫిలింకార్పొరేష‌న్ ప‌తాకంపై తెర‌కెక్కే ఈ చిత్రానికి గోపి మోహ‌న్ స్క్రిప్టు అందిస్తున్నారు. ఈ చిత్రంలో మాధ‌వ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ- కోన ఫిలిం కార్ప్‌ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ఈ చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా కొన‌సాగ‌నున్నారని కోన వెంక‌ట్ తెలిపారు.

User Comments