అనుష్క భయపెట్టడం ఖాయం

Last Updated on by

నిజంగానే.. ఇప్పుడు అనుష్క‌ను చూస్తే భ‌య‌ప‌డ‌టం ఖాయం. అంత‌గా మారిపోయింది ఈ భామ‌. ప‌రి ట్రైల‌ర్ విడుద‌లైంది. అనుష్క శ‌ర్మ నిర్మిస్తూ న‌టించిన సినిమా ఇది. ప్రోసిత్ రాయ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మార్చ్ 2న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్.. పోస్ట‌ర్స్ సినిమాపై ఓ రేంజ్ లో ఆస‌క్తి పెంచేసాయి. ఇక ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ అయితే ఏకంగా భ‌య‌పెట్టేసి.. మ‌రో లోకంలోకి తీసుకెళ్లిపోయింది. ఇప్ప‌టికే కొన్ని వంద‌ల సార్లు దెయ్యాల క‌థ‌లు చూసుంటాం.. కానీ తీసే ప్ర‌తీసారి కాస్త కొత్త‌ద‌నం ఉంటే చాలు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటారు. ఇది తెలిసే పరి సినిమాపై డ‌బ్బులు పెట్టింది అనుష్క‌.

పరి చిత్రానికి నిర్మాత అనుష్క‌ నే. ఎన్ హెచ్ 10 త‌ర్వాత అనుష్క నిర్మించిన సినిమా ఇది. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్స్ లో ప‌రి ఖచ్చితంగా ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంద‌ని చెబుతుంది అనుష్క‌. ఈ చిత్రంతో మ‌రోసారి త‌న న‌ట‌న ప్ర‌తిభేంటో చూపిస్తుంది అనుష్క‌. ట్రైల‌ర్ లోనే చాలా అంటే చాలా భ‌య‌పెట్టింది ఈ భామ‌. మ‌రి రేపు సినిమా ఇంకెంత భ‌య‌పెట్టి వసూళ్లు సాధిస్తుందో..!

User Comments