అనుష్క సీక్రెట్స్ లీక్‌

Last Updated on by

స్నేహం కోసం అతిధి పాత్ర‌ల్లో త‌ళుక్కుమ‌న‌డం అన్న ప్ర‌క్రియ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఉంది. అలానే ఫ‌లానా స్టార్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తే అది సినిమాకి క‌లిసొస్తుంద‌ని భావిస్తే ప్ర‌త్యేకించి ఆ పాత్ర‌ను హైలైట్ చేస్తుంటారు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు. ఇప్పుడు అదే తీరుగా సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్‌లో ఓ స‌ర్‌ప్రైజింగ్ రోల్ ఉంద‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌లో ట్యాలెంటెడ్ అనుష్క శ‌ర్మ స‌ర్‌ప్రైజ్ ఇస్తుందిట‌. ద‌ర్శ‌క‌నిర్మాత రాజ్‌కుమార్ హిరాణీ స్వ‌యంగా ఈ విష‌యాన్ని రివీల్ చేశారు.
బాలీవుడ్ ఖ‌ల్‌నాయ‌క్ సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. సోన‌మ్ క‌పూర్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రంలో ప‌లు ఆస‌క్తిక‌ర పాత్ర‌ల్ని ఒక్కొక్క‌టిగా ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో రివీల్ చేస్తోంది చిత్ర‌బృందం. ఈ రోజు ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర గురించి రివీల్ చేసేందుకు రాజ్‌కుమార్ హిరాణీ ప్లాన్ చేస్తున్నారు. “డియ‌రెస్ట్ ఫ్రెండ్ అనుష్క స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇచ్చింది. కానీ మాతో పాటు కొన్ని రోజుల పాటు షూటింగులో పాల్గొని స‌హ‌క‌రించింది. త‌న పాత్ర ఏంటి అనేది ఊహించ‌గ‌ల‌రా? ట‌్రైల‌ర్ లాంచ్‌లో రివీల్ చేస్తాం.. అంత‌వ‌ర‌కూ వేచి చూడండి“ అని రాజ్‌కుమార్ హిరాణీ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో ఆ సీక్రెట్ రివీల‌వుతుంద‌న్న‌మాట‌! ఇంత‌కీ అనుష్క భూత‌ప్రేతంగా న‌టించిందో ఏమో!!

User Comments