అనుష్క‌ను కావాల‌నే ఇరికించారా?

అవును అనుష్క‌ను ఇరికించారు. కావాల‌నే కొంద‌రు కుట్ర చేసి ఇరికించారు. ఇది నిజ‌మా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌- టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దాంప‌త్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వృత్తిప‌ర‌మైన జీవితాల్లో బిజీగా ఉంటూనే  సెల‌వులు దొరికితే విహార యాత్ర‌లు చేస్తూ న‌చ్చిన‌ట్టు ఆస్వాధిస్తున్నారు. అయితే అనుష్క లైఫ్ లోకి అనూహ్యంగా ఓ వివాదం జోరీగ‌లా ప్ర‌వేశించ‌డంపై ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అనుష్క శుర్మ బాలీవుడ్ సెల‌బ్రిటీ కావ‌డంతో  విరాట్ జ‌ట్టు స‌భ్యులు స‌హా సెల‌క్ట‌ర్ల‌తోనూ స్నేహంగా మెలుగుతున్న వైనం ఫోటోల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ్రౌండ్ లో  ఏ క్రికెట‌ర్ బాగా ఆడినా అత‌డిని మెచ్చుకుని టీమ్ స‌భ్యుల్లో జోష్ నింపుతోంది. విరాట్ భార్య కావ‌డంతో సెల‌క్ట‌ర్లు ఆమెకు ప్ర‌త్యేక‌మైన గౌర‌వం ఇస్తున్నారు. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో అనుష్క‌కు ఓ సెల‌క్ట‌ర్ టీ అందించాడంటూ మాజీ ఆట‌గాడు ఫ‌రూక్ ఇంజ‌నీర్ వ్యాఖ్యానించారు.

ఇది ఈ వ్యాఖ్య‌ల‌పై విరాట్ సీరియ‌స్ అయ్యాడు. శ్రీలంక‌తో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ ను చూసేందుకు అనుష్క స్టేడియానికి వ‌చ్చింది. ఆట స‌మ‌యంలో సెల‌క్ట‌ర్ల బాక్సులో కాకుండా ఇద్ద‌రు ఫ్రెండ్స్ తో క‌లిసి ఫ్యామిలీ బ్లాక్ లో కూచుంది. అప్పుడు ఆమెతో ఏ సెల‌క్ట‌ర్ లేడు. అనుష్క సెల‌బ్రిటీ కాబ‌ట్టి ఆమె పేరును కొంద‌రు కావాల‌నే వివాదంలోకి  లాగి లాభ‌ప‌డుతున్నారు. సెల‌క్ట‌ర్లు గురించి మాట్లాడిన‌ప్పుడు నా భ‌ర్య పేరు ఎందుకు తీస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాడు.

అనుష్క సెల‌బ్రిటీ కావ‌డ‌మే ఆమె చేసిన త‌ప్పా?  లేక నేను అనుష్క‌ని పెళ్లి చేసుకోవ‌డం త‌ప్పా? అని ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి మీ పెద్ద‌రికాన్ని పోగొట్టుకోకండి అంటూ చుర‌క‌లు అంటించాడు.  ఫ‌రూక్ వ్యాఖ్య‌ల్ని అనుష్క ఇప్ప‌టికే ఖండించిన సంగ‌తి తెలిసిందే. అదే ప‌నిగా అబ‌ద్దాలు చెబుతూ వెళితే.. అవే నిజ‌మ‌వుతాయ‌ని భ‌య‌ప‌డి అనుష్క మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చింది.