భాగ‌మ‌తి పోగొడుతోంది అందరి మ‌తి

Last Updated on by

ఒకేసారి నాలుగు భాష‌ల్లో వ‌చ్చిన సినిమా అంటే ఖచ్చితంగా అన్ని భాష‌ల్లోనూ మంచి అంచ‌నాలే ఉంటాయి. భాగ‌మ‌తి కూడా భారీ అంచ‌నాలతోనే అన్ని భాష‌ల్లో విడుద‌లైంది. కానీ ఒక్క తెలుగులో మాత్ర‌మే ఈ చిత్రం ఆడుతుంది. మిగిలిన అన్ని భాష‌ల్లోనూ భాగ‌మ‌తి తోక ముడిచింది. మ‌రీ ముఖ్యంగా త‌మిళ‌నాట అయితే ఈ చిత్రం భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. అక్క‌డ రైట్స్ కు క‌నీసం స‌గం కూడా తీసుకొచ్చేలా క‌నిపించ‌ట్లేదు. ఇక కేర‌ళ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా భాగ‌మ‌తి ఫ‌లితం మార‌లేదు. ఒక్క తెలుగులో మాత్ర‌మే అనుష్క పుణ్య‌మా అని బాగా ఆడుతుంది ఈ చిత్రం.

ఇప్ప‌టి వ‌ర‌కు భాగ‌మ‌తి తెలుగులో తొలి వారం 17 కోట్ల షేర్ వ‌సూలు చేసింది, అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా 21 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఓవ‌ర్సీస్ లో 3 కోట్ల‌కు పైగా షేర్ సాధించ‌డం విశేషం. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఇది చాలా ఎక్కువ మొత్తం. మొత్తానికి భాగ‌మ‌తి భారీ ఓపెనింగ్స్ సాధించ‌డంతో అనుష్క ఇమేజ్ ఇంకా త‌గ్గ‌లేద‌ని తెలిసింది. అయితే ఇదే ఊపుతో సినిమాలు చేయ‌క‌పోతే మాత్రం ఖచ్చితంగా జేజమ్మ‌ను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కులు మ‌రిచిపోవ‌డం ఖాయం. పైగా ఈమె భారీ సైజ్ కూడా ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడుతుంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం చేస్తదో ఈ జేజ‌మ్మ?

User Comments