అనుష్క‌కు అక్క‌డేం ప‌ని..?

ఈ మ‌ధ్య కాలంలో అనుష్క బాగా ఖాళీ అయిపోయింది. ఏడాదిన్న‌ర‌గా సినిమాలేవీ ఒప్పుకోవ‌డం లేదు. అప్పుడెప్పుడో ఒప్పుకున్న భాగ‌మ‌తిని ఇప్పుడు పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ‌. జ‌న‌వ‌రి 26న సినిమా విడుద‌ల కానుంది. ఆ సినిమా ప్ర‌మోష‌న్ తోనే బిజీగా ఉందిప్పుడు ఈ భామ‌. అయితే మ‌ధ్య‌లో ఉన్న‌ట్లుండి సాహో టీంతో క‌నిపించి అంద‌రికీ షాకిచ్చింది జేజ‌మ్మ‌. అస‌లు సాహో టీంతో అనుష్కకు ఏంటి సంబంధం అంటూ ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు.

కొంప‌దీసి అనుష్క ఈ చిత్రంలో కూడా న‌టిస్తుందా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. అయితే అక్క‌డి వ‌ర‌కు ఏం లేదు.. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. అనుష్క కూడా ఇక్క‌డే సినిమా ప్రమోష‌న్ లో ఉంది. ఎలాగూ ఇక్క‌డే ఉంది క‌దా అని ఓ సారి సాహో టీం ను కూడా క‌లిసి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ప‌నిలో ప‌నిగా చిత్ర‌యూనిట్ తో క‌లిసి ఫోటోలు కూడా దిగి ఫేస్ బుక్ లో పెట్టింది. ఈమె భాగ‌మ‌తి జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది. మొత్తానికి మ‌ధ్య‌లో కాస్త రిలీఫ్ కోసం సాహో టీంతో ఇలా పోజులిచ్చింది స్వీటీ. అంతేకానీ సాహోతో ఈమెకు ఎలాంటి సంబంధం అయితే లేదు..!

User Comments