జేజ‌మ్మ‌.. కొంచెం తగ్గమ్మా

Last Updated on by

అనుష్క‌ను చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నారు అభిమానులు. లేక‌పోతే మ‌రేంటి.. బ‌రువు త‌గ్గ‌దు.. బ‌య‌టికి రాదు.. కొన్ని రోజులుగా కూడా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది ఈ భాగ‌మ‌తి. అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అజ్ఞాత‌వాసి అంటున్నాం కానీ అనుష్క‌కు ఈ టైటిల్ ప‌క్కాగా సెట్ అవుతుంది. చాలా రోజుల త‌ర్వాత ఇప్పుడు అజ్ఞాతం వీడింది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్ని రోజ‌లు క‌నిపించ‌లేదు కదా క‌ష్ట‌ప‌డి బ‌రువు కానీ త‌గ్గిందేమో అనుకున్నారంతా. కానీ తానింకా అలాగే ఉన్నాన‌ని మ‌రోసారి త‌న ఫిజిక్ ను చూపించింది ఈ జేజ‌మ్మ‌. తాజాగా ఓ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అనుష్క‌ను చూసి అంతా షాక్ అయ్యారు. ఇప్ప‌టికీ అదే ఫిజిక్ తో ఆంటీలా ఉందని అనుకొంటున్నారు.

ఇప్పుడు అనుష్క‌ చేతిలో సినిమాలు కూడా ఏం లేవు. ఈ మ‌ధ్యే గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తుంద‌నే వార్త‌లొచ్చాయి. ప్ర‌భాస్ కు స్నేహితుడు.. పైగా గ‌తంలోనూ క‌లిసి రెండు సినిమాలు చేసారు.. కాబ‌ట్టి గోపీతో న‌టిస్తుందేమో చెప్ప‌లేం కానీ ఇప్ప‌టికైతే ఎలాంటి స‌మాచారం లేదు. గౌత‌మ్ మీన‌న్ సినిమాకు సైన్ చేసినా ఇప్ప‌ట్లో ఇది ఊహించ‌డం క‌స్ట‌మే. ఏ క్ష‌ణంలో సైజ్ జీరో సినిమాకు సైన్ చేసిందో కానీ అప్ప‌ట్నుంచీ అనుష్క గ‌త వైభ‌వం కోల్పోయింది. ఫిజిక్ ప‌రంగా పాత అనుష్క‌ను మ‌ళ్లీ చూడ‌టం గ‌గ‌నమే. అలాగ‌ని ఇంత త్వ‌ర‌గా ఆంటీ పాత్ర‌ల‌కు అనుష్క ఒప్పుకుంటుంద‌నుకోవ‌డం కూడా అవివేక‌మే. మ‌రి.. ఈ జేజ‌మ్మ కెరీర్ ఎటువైపు ట‌ర్న్ తీసుకోబోతుందో..?

User Comments