మ‌హేష్‌, బ‌న్నీకి పోటీగా స్వీటి

2020 సంక్రాంతికి ఇప్ప‌టికే ఇద్ద‌రు టాప్ హీరోలు క‌ర్చీప్ వేసారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`, బ‌న్నీ -త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల‌కు పోటీగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న కొత్త చిత్రం బ‌రిలోకి దిగుతోంది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ల‌ర్ అయితే త‌ప్ప ఆ టాప్ స్టార్లు ఇద్ద‌రికీ పోటీ అనేది ఇచ్చిన‌ట్లు కాదు. తాజాగా ఈ మూడు చిత్రాల‌కు పోటీగా స్వీటి అనుష్క కూడా బ‌రిలోకి దిగుతోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో మేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సైలైన్స్ తెలుగులో నిశ‌బ్ధంగా రిలీజ్ అవుతోంది.

ఇందులో మ్యాడీ మాధ‌వ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అంజలి, షాలిని పాండే హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ వంటి వారు ముఖ్య పాత్ర‌లు న‌టిస్తున్నారు. ఇంత భారీ కాస్టింగ్ నేప‌థ్యంలో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగులో అనుష్క క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సింగిల్ గానే బాక్సాఫీస్ ను షేకాడించే స‌త్తా ఉన్న న‌టి. అరుంధ‌తి, భాగ‌మ‌తి, బాహుబ‌లి చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. కాబ‌ట్టి బ‌న్నీ, మ‌హేష్ ల‌కు గ‌ట్టి పోటినివ్వ‌గ‌ల‌దు.