క‌న్న‌డ రాజ‌కీయాల్లోకి అనుష్క‌

Last Updated on by

అందాల క‌థానాయిక అనుష్క శెట్టి జాడ మిస్స‌య్యింది. గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌లో ఈ భామ సంద‌డి అస్స‌లు క‌నిపించ‌డం లేదు. అస‌లింత‌కీ అనుష్క‌కు ఏమైంది?  భాగ‌మ‌తి త‌ర‌వాత ఈ అమ్మ‌డు అస‌లు వేరొక సినిమాకి సంత‌కం చేసిందే లేదు. అప్ప‌ట్లోనే `సైజ్ జీరో` కోసం బ‌రువు పెర‌గ‌డంతో స‌న్న‌బ‌డ‌డం కోసం చికిత్స చేయించుకుంద‌ని, సీరియ‌స్‌గా జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే ఓ వేడుక‌లో మారిన రూపంతో క‌నిపించి ఆక‌ర్షించింది. అయితే ఇటీవ‌లి కాలంలో స్వీటీ అస్స‌లు క‌నిపించ‌దేం? అస‌లేం జ‌రుగుతోంది?

ప్ర‌భాస్ స‌ర‌స‌న `సాహో`లో న‌టిస్తోంద‌ని ప్ర‌చార‌మైనా, అస‌లు ఆ ప్రాజెక్టుకు సంత‌క‌మే చేయ‌లేదు. అటుపై ప్ర‌భాస్ హీరోగా జిల్ రాధాకృష్ణ క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌నున్న త‌దుప‌రి చిత్రానికి స్వీటీ సంత‌కం చేసిందేం లేదు. ఆ క్ర‌మంలోనే అనుష్క అస‌లేం చేస్తోంది? అన్న సందేహం క‌లుగుతోంది. ఒక‌వేళ ముందే ప్ర‌చారం అయిన‌ట్టు, అనుష్క‌కు పెళ్లి సంబంధాలు ఏవైనా చూస్తున్నార‌ని భావించాలా? ఈ విష‌యంలో అంత‌కంత‌కు అనుమానాలు పెరుగుతున్నాయే కానీ త‌గ్గ‌డం లేదు. అయితే అస‌లేమైంది? అని వెతుకుతుంటే వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టు.. అనుష్క బెంగ‌ళూరులోని త‌న స్వ‌గృహంలో క‌నిపించింది. నేడు క‌ర్నాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భ ంగా స్వీటీ ట‌చ్‌లోకి వ‌చ్చింది. తాను ఓటేయ‌డ‌మే గాకుండా, అంద‌రినీ ఓటేయ‌మ‌ని కోరింది. వేలికి సిరా మార్క్ వేసిన ఓ సింబ‌ల్‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. “ఓటు ఎంతో విలువైన‌ది. అది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు. తెలివిగా ఆలోచించి మీ ఓటు వేయండి. ఓటు వేయ‌డం మాత్రం త‌ప్ప‌నిస‌రి“ అని అనుష్క కోరింది. 2018 క‌ర్నాట‌క ఎన్నిక‌ల గురించి ఈ త‌ర‌హాగా అవేర్‌నెస్‌తో ప్ర‌చారం చేస్తోంది కాబ‌ట్టి .. అనుష్క శెట్టి అభిమానుల‌కు ఓ సందేహం క‌లిగింది. ఒక‌వేళ అనుష్క పెళ్లి చేసుకుని క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో యాక్టివ్ కాబోతోందా? అందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు వేస్తోందా? అన్న సందేహం క‌లిగింది. క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఇప్ప‌టికే ప‌లువురు యువ‌క‌థానాయిక‌లు నిరూపించుకున్న సంద‌ర్భ ంగా ఈ సందేహం స‌హ‌జ‌మైన‌దే. చూద్దాం స్వీటీ ఏం చేయ‌బోతోందో?

User Comments