అనుష్క .. ఆ భంగిమ ఏంటో?

Last Updated on by

Last updated on May 6th, 2018 at 09:18 am

బాలీవుడ్ క‌థానాయిక అనుష్క శ‌ర్మ తుళ్లింత‌.. క‌వ్వింత గురించి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ఐపీఎల్ హీట్ కంటే అనుష్క హీట్ అంత‌కంత‌కు రెట్టింప‌వుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల వేళ హ‌బ్బీ విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టినా, క్యాచ్ ప‌ట్టినా.. కింద ప‌డినా… అనుష్క ఎక్స్‌ప్రెష‌న్స్ చూడాలి. ఇప్ప‌టికే అంత‌ర్జాలం నిండా ఈ భామ‌కు సంబంధించిన విలాప‌మే ద‌ర్శ‌న‌మిస్తోంది. అదంతా స‌రే.. కేవ‌లం హ‌బ్బీ విష‌యంలోనే అనుష్క ఇలా ఫీల‌వుతుందా? లేక ఇంకే సంద‌ర్భంలో అయినా అలా ఎక్స్‌ప్రెస్సివ్‌గా ఫీల‌వుతుందా? అని వెతికితే.. ఇదిగో ఇలా ఫ్యాష‌న్ & ట్రెండ్స్‌కి ప్ర‌మోష‌న్ చేయ‌డంలోనూ అనుష్క త‌న‌దైన శైలిని చూపిస్తోంద‌ని అర్థ‌మైంది.

మేటి క‌థానాయిక అనుష్క శ‌ర్మ‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల రంగంలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే ప‌లు బ్రాండ్ల ప్ర‌చారం కోసం కార్పొరెట్ కంపెనీలు అనుష్క తో భారీ కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. ఇలా త‌న‌వైపు వ‌చ్చిన అవ‌కాశాల‌కు కోట్ల‌లో గుంజుతోంది. తాజాగా వేరొక ప్ర‌ఖ్యాత బ్రాండ్ త‌న ఖాతాలోకి చేరింది. ప్ర‌తిష్ఠాత్మ‌క `న‌ష్‌` స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్స్‌కు సంబంధించి అనుష్క శ‌ర్మ‌ కాంట్రాక్టును కుదుర్చుకుంది. షాప‌ర్స్ స్టాప్‌లో ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుందంటూ అనుష్క ప్ర‌చారం చేస్తోంది. ఇదిగో ఇక్క‌డ ఈ స్పెష‌ల్ డిజైన్డ్ స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్ చూశారా? ఫెంటాస్టిక్‌గా ఉంది క‌దూ? ఇక కెరీర్ ప‌రంగా చూస్తే అనుష్క శ‌ర్మ .. షారూక్ `జీరో` చిత్రంతో పాటు, ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

User Comments