బాల‌య్య‌కు ఏపీ సీఎం వీరాభిమాని

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై చాలా కాలంగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ చిన్న నాటి నుంచి బాల‌య్య‌కు అభిమాని అని,  బాల‌య్య సినిమాలు రిలీజ్ అయితే జ‌గ‌న్ చేసే హ‌డావుడి అంతా ఇంతా కాద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ముఖ్యంగా బాల‌య్య రాయ‌ల‌ సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చూసే జ‌గ‌న్ త‌న‌కు అభిమానిగా మారార‌ని అంటుంటారు. తాజాగా ఆ రూమ‌ర్లు నిజ‌మేనని న‌టుడు, ఏఫీ ఎఫ్ డీసీ చైర్మ‌న్ విజ‌య చంద‌ర్ పున‌రుద్ఘాటించారు.

“ఆ ప్ర‌చారం అక్ష‌ర సత్యం. మా యువ‌నేత జ‌గ‌న్ బాల‌య్య‌కి వీరాభిమాని. ఆ అభిమానం ఇప్ప‌టిది కాదు. జ‌గ‌న్ చిన్న‌ప్పుడే బాల‌య్య‌పై ఏర్ప‌రుచుకున్న అభిమానం అది. జీవితాంతం అత‌ని అభిమాన హీరో అత‌నే.  బాల‌య్య సినిమాలు క‌డ‌ప లో రిలీజ్ అవుతున్నాయంటే జ‌గన్ హ‌డావుడి మామూలుగా ఉండేది కాదు. క‌టౌట్లు, ప్లేక్సీలు రిలీజ్ ముందు రోజు థియేట‌ర్ ముందు క‌ట్టాల్సిందే. ఆ విష‌యంలో జ‌గ‌న్ అప్ప‌టి అభిమానుల‌తో క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భాలున్నాయిన‌“ అన్నారు. అలాగే జ‌గ‌న్ టాలీవుడ్ ని అభివృద్ధి  చేస్తార‌ని తెలిపారు. పార్టీల ప‌రంగా జ‌గ‌న్ -బాల‌య్య వేరు అయినా అభిమానం అన్న‌ది వేరు అని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.  నేరుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప‌నిచేస్తోన్న నేత‌ ద్వారా బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ వ్యాఖ్య‌లు అంత‌టా హాట్ టాపిక్ అవుతున్నాయి.