నందుల వైపు జ‌గ‌న్ చూపు!

అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్పాటైన నాటి నుంచి రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి అందిందే నంది అవార్డులు ప్ర‌ధానత్స‌వం స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేదు. 2014, 2015, 2016 గాను నంది అవార్డులు అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం ప్రకటించి వ‌దిలేసింది. దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌దానోత్సవం జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యాన్ని ప‌లుమార్లు అప్ప‌టి ముఖ్య‌మ‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినా ఆయ‌న బిజీ షెడ్యూల న‌డుమ ప‌ట్టించుకోలేదు. అప్ప‌టి నుంచి ఈ విష‌యంలో సినిమా పెద్ద ల నుంచి కాస్త అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.

అయినా నందుల‌వైపు చూసే నాధుడే లేడు. తాజాగా ఏపీకి నూత‌న ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన జ‌గన్మోహ‌న్ రెడ్డి దృష్టికి ఈ విష‌యాన్ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తీసుకెల్లారుట‌. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌త్యంలో వీలైనంత త్వ‌ర‌గా అవార్డుల ప్రదానోత్స‌వం జ‌రిగితే బాగుంటుంద‌ని సూచించారుట‌. అలాగే 2017 కు సంబంధించిన జాబితా కూడా జ్యూరీ క‌మిటీ రిలీజ్ చేస్తే అదే వేదిక‌పై అవార్డులు బ‌హుక‌రించ‌డానికి అవ‌కాశం ఉంటుందని చెప్పారుట‌. జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. అయితే స్ప‌ష్ట‌మైన అదేశాలైతే ఇవ్వ‌లేదుట‌.