ఏపీ ప‌రిశ్ర‌మ‌పై కులం కంచె!

Last Updated on by

చిన్న సినిమాల‌కు పెద్ద స‌పోర్ట్ అంటూ ఏపీ ప్ర‌భుత్వం ఊద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో సినీప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తామ‌ని, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఇదివ‌ర‌కూ ఆర్భాటంగా బెజ‌వాడ‌- ఎఫ్‌డీసీ ప్ర‌క‌టించేసింది. ఆ మేర‌కు తాజాగా జీవోలు తెస్తున్నార‌న్న ప్ర‌చారం మ‌రోసారి హోరెత్తుతోంది.

ఆ క్ర‌మంలోనే ఏపీ – సినీప‌రిశ్ర‌మ ఏర్పాటుపై ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీ చుట్టూ చాలా రాజ‌కీయాలే ఉన్నాయి. ఇందులో కులం ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంద‌న్న వాద‌న‌ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇక్క‌డ ఒకే ఒక్క కులం కంచె వేసేందుకు రెడీ అవుతోంద‌న్న వాద‌నా బ‌లంగా వినిపిస్తోంది. మా కుల‌పోళ్ల‌కే ఇండ‌స్ట్రీ సెట‌ప్ అవ‌కాశ‌మిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భీష్మించుకుని కూచుకుంద‌ని చెబుతున్నారు.  బాల‌య్య‌కు స్టూడియో సెట‌ప్‌కి భూములు క‌ట్ట‌బెట్ట‌డం వెన‌కా కుల‌రాజ‌కీయాలు ఉన్నాయిట‌. ఇలా అయితే చిరంజీవి, అల్లు అర‌వింద్ వంటి వాళ్ల  సినీఇండ‌స్ట్రీ సెట‌ప్ క‌ల‌లు ఏమైపోవాలి? అన్న మాటా వినిపిస్తోంది. ఏపీలో నిర్మించే చిన్న సినిమాల‌కు 10ల‌క్ష‌ల స‌బ్సిడీ ని వ‌ర్తించే జీవోలు వ‌స్తున్నాయి. తొలిగా రిజిస్ట‌ర్ చేసుకున్న 15 సినిమాల‌కు ఈ ఛాన్స్ ఉంటుంది. అవి కూడా త‌మ కులానికే చెందాల‌న్న రూల్ తెస్తారేమోన‌న్న ఆందోళ‌నా వ్య‌క్తం అవుతోంది. ప్చ్.. కులం కంపులేని రంగం ఉందా?!!!

User Comments